అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన రేవెల్లి మధుసూదన్ తండ్రి వెంకటేశ్వర్లు 29 సంవత్సరాలు వృత్తిరీత్యా పూజారిగా వ్యవహరిస్తాడు. అతడు ఆర్థిక ఇబ్బందులతో గత కొంతకాలంగా సతమతమవుతూ మంగళవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, మృతుని తండ్రి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ తెలిపారు.

కాళోజికి నివాళులర్పించిన న్యాయవాద పరిషత్ నిజామాబాద్ సెప్టెంబర్ 09: (తెలంగాణ వాణి ప్రతినిధి) ప్రజల గొంతుకై గళమెత్తిన కాళోజీ హైదరాబాద్ సంస్థాన విమోచన కోసం ఉద్యమం నడిపిన కాళోజీ నారాయణ రావు ప్రజాజీవితం ఆదర్శనీయమని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. కాళోజీ111 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవితలు, కథలు రచించి ప్రజా ఉదయమానికి పూనాదులు వేశారని కొనియాడారు. […]
13 రోజులకు శ్రీకర్ మృతదేహం లభ్యం

మెట్ పల్లి (తెలంగాణ వాణి) జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన కాటిపెల్లి శ్రీకర్ రెడ్డి, గత నెల 27న ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఎస్సార్ ఎస్పీ కాలువలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. అందులో ఇద్దరు బయటపడగా, శ్రీకర్ రెడ్డి కెనాల్లో కొట్టుకుపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీకర్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా సోమవారం తాటిపెల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పి కాలువలో శ్రీకర్ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం […]
చిన్నారి వైద్యానికి చేయూత

మరోసారి మానవత్వం చాటుకున్న పొంగులేటి క్యాంప్ శ్రేణులు కొత్తగూడెం (తెలంగాణ వాణి) తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతు కొత్తగూడెంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ శ్రేణులు, ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మండలం నాగారం కాలనీ చెందిన కేసోజు కృష్ణమాచారి రేవతి దంపతుల కుమార్తె జ్ఞాన్విక తీవ్ర అనారోగ్యం పాలై శ్వాసకి సంబంధించిన […]
వినాయక నిమజ్జన శోభాయాత్రలో అపశృతి

కన్ను భాగం నుండి దూసుకు వెళ్లిన టపాకాయ మల్లాపూర్ (తెలంగాణ వాణి) మండలంలోని ముత్యంపేటలో రేవంత్ సేన యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో టపాకాయలు పేలుస్తుండగా ప్రమాదవశాత్తు చిట్యాల అరవింద్ అనే యువకుడి కన్నులోంచి తపాకాయ దూసుకు వెళ్ళింది. అరవింద్ ను మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాదుకు తరలించారు.

మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరిని కలిసిన మండల ఓబీసీ నాయకులు ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వాస్తవ్యులు కీర్తిశేషులు పరికిపండ్ల సత్యనారాయణ 9వ వర్ధంతి సందర్భంగా బసంత్ నగర్ విచ్చేసిన మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి (ఐఏఎస్) ను శనివారం బసంత్ నగర్ లోని వారి నివాసంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కొత్త నరసింహులు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం సత్యనారాయణ చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఓబిసి […]
సంక్షేమ శాఖ మంత్రిని కలిసిన శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులు

ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం మండల కేంద్రంలోని శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులందరు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆదివారం ఉదయం మండల కేంద్రంలోని శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో గొల్లవాడ, రామాలయం సమీపంలో ఉన్న గణపతి మండపాల వద్ద నిర్వహించే లక్కీ డ్రా తీయడానికి మంత్రిని ఆహ్వానించగా మంత్రి స్పందిస్తూ తప్పకుండా హాజరవుతానని తెలిపినట్లు కమిటీ […]
గణనాథునికి 10 వేల రూపాయల విరాళం

ధర్మారం (తెలంగాణ వాణి) మండల కేంద్రంలోని బోయవాడ, ఎస్సీ కాలనీ, బెస్తవాడలో కొలువైన భారీ గణనాథులను మాజీ విఎస్ఎస్ చైర్మన్ దేవి జనార్ధన్ గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం 10 వేల రూపాయల చొప్పున మొత్తం ముప్పైవేల రూపాయలు నిర్వాహకులకు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ద్యాగేటి ఉదయ్ యాదవ్, సోగల తిరుపతి, ద్యాగేటి అనిల్, దేవి అఖిల్, పాలకుర్తి సాయి, పెరుమండ్ల ప్రసాద్, గుమ్ముల నరసయ్య, బొల్లి నాగరాజు, తిరుపతి, తదీతరులు […]
BREAKING: BRS నుంచి కవిత సస్పెండ్ MLC కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు BRS ప్రకటించింది. ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు ప్రకటన విడుదల చేశారు. కొంతకాలంగా కవిత పార్టీ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఏకంగా హరీశ్ రావుపైనే అవినీతి ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో హరీశ్, సంతోశ్ రావులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
వరద బాధితులకి చేయూతనిచ్చిన జనసేన పార్టీ నాయకులు
వరద బాధితులకి చేయూతనిచ్చిన జనసేన పార్టీ నాయకులు వేములవాడ,సెప్టెంబర్ 02 (తెలంగాణ వాణి) : జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని వరద బాధితులకు మంగళవారం నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇబ్బందులకు గురైన ప్రజలకి జనసేన పార్టీ నాయకులు బుర్ర అజయ్ బబ్లు గౌడ్ ఆధ్వర్యంలో 150 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ […]