UPDATES  

NEWS

విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ బహుకరించిన రాజమౌళి- అరుణ దంపతులు ఇందిరమ్మ మోడల్ కాలనీలో విక్రయాలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి

 ఆదరించండి.. అభివృద్ధి చేస్తా : వజ్జా ఈశ్వరి

ప్రచారంలో దూసుకుపోతున్న సిపిఐ పార్టీ సర్పంచి అభ్యర్థి

లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) చాతకొండ గ్రామ ప్రజలు తనని ఆదరించి ఉంగరం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించి సర్పంచిగా గెలిపిస్తే చాతకొండ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సిపిఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వజ్జా ఈశ్వరి అన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆశీస్సులతో గ్రామానికి అధిక నిధులు తీసుకొచ్చి గ్రామంలో గత పాలకవర్గం చేయని, మిగిలిన పనులను పూర్తి చేసి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని శుక్రవారం జరిగిన ప్రచారంలో గ్రామప్రజలకు హామీ ఇచ్చారు. పంచాయతీ బరిలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూనంనేని సాంబశివరావు ఆశీస్సులతో చాతకొండ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తాను అహర్నిశలు కష్టపడి గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులతో పాటు, అర్హులైన వారికి పెన్షన్స్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. యువతీ యువకులకు ఆయా కులాల కార్పొరేషన్ రుణాలను ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలోని సమస్యలను తీర్చేందుకు అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటుగా, గ్రామ పెద్దలు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.

Date of Publish : 12 December 2025, 12:37 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest