అనవసరమైన లింకులను ఓపెన్ చేయవద్దు : ఎస్సై మహేందర్ రెడ్డి
జుక్కల్/కామారెడ్డి (తెలంగాణ వాణి ప్రతినిది) కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో గురువారం ఎస్సై మహేందర్ రెడ్డి మండల ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దని,అనవసరమైన లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు సిబ్బంది వెంకట్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం
అనకాపల్లి:చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్ర గారు అన్నారు. శుక్రవారం లక్ష్మీనారాయణ నగర్ లోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆస్తులను రాష్ట్రవ్యాప్తంగా కబ్జా చేయాలనే దురుద్దేశంతో జగన్ ప్రవేశపెట్టిన భూ యాజమాన్య చట్టాన్ని చంద్రబాబు రద్దు చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న తమ ఆస్తులను జగన్ కబ్జా చేస్తాడనే భయంతో రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు కూడా తమ సొంత […]
విద్యుత్ కార్యాలయంలో ఇంటి దొంగలు
విద్యుత్ శాఖకు సంబంధించిన పాత ఇనుప స్తంభాలు మరియు సామగ్రి చీకట్లో అక్రమంగా తరలింపు వాటిని అమ్ముకుని జేబులు నింపుకున్న ఓ అధికారి…? జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో కొన్ని రోజుల క్రితం జీవీఎంసీ వారు చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ శాఖ సిబ్బంది పాత ఇనుప విద్యుత్ స్తంభాలను, సామగ్రిని తీసి వాటి స్థానంలో కొత్త సిమెంట్ స్తంభాలను, కొత్త సామగ్రి అమర్చారు.తొలగించిన విద్యుత్ ఇనుప స్తంభాలను మరియు సామాగ్రిని అనకాపల్లి బెల్లం మార్కెట్ […]
రాష్ట్రంలో అల్లర్లు… సీఎం అభ్యర్థులు విదేశీ పర్యటనలా..
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి. టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డారు. పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, సీఎం జగన్ విదేశీ పర్యటన, హింసాత్మక ఘటనలపై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన… పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇలాంటి […]
అభిషేక్ శర్మ దూసుకుపోతున్న సన్ రైజర్స్ ప్లేయర్
సన్ రైజర్స్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024లో తన సత్తా చూపుతున్నాడు. ఓపెనర్‌గా వచ్ఛి మెరుపు వేగంతో బ్యాటింగ్లో ప్రతిభ కనబరుస్తున్నాడు. శుక్రవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 37 పరుగులు చేయగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. ఈ సిరీస్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో 74 బంతులు ఎదుర్కొని 161 పరుగులు చేశాడు. అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్న ఈ ప్లేయర్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని అభిమానుల నుంచి వాదనలు […]
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు-2024
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఉంది.అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక eapcet.tsche.ac.in డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వరాహ నదిలో బయటపడ్డ అమ్మవారి విగ్రహం
అనకాపల్లి:జిల్లా ఎస్ రాయవరం మండలం పెద ఉప్పలం గ్రామ సమీపంలో వరహ నదిలో శక్తి రూపం బయటపడింది. పనికి ఉపాధి హామీ పథకం పనులు చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న గ్రామస్తులకు వరాహనదిలో అమ్మవారు విగ్రహం దర్శనమిచ్చింది. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం వాకపాడు గ్రామస్తులు ప్రతిరోజు ఉదయాన్నే పనికి ఆహార పథకంలో భాగంగా పనులు చేసుకుని తిరిగివస్తు వరాహనది లోనించి నడుచుకి వస్తుండగా సగం ఇసుకలో కూరుకుపోయిన రాతి విగ్రహం కంటపడింది. గ్రామస్తులు దగ్గరికి […]
రక్తపోటు పట్ల అప్రమత్తంగా వుండాలి
రక్తపోటు (బి.పి) పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తత తో వుండాలని అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ.హేమంత్ పిలుపు నిచ్చారు. శుక్రవారం మే,17 “ప్రపంచ రక్తపోటు దినం” సందర్భంగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇటీవల కాలంలో సమాజంలో రక్తపోటు బాధితుల సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లోపించడం, ఫాస్ట్ పుడ్స్ కారణంగా చిన్న వయసులోనే రక్తపోటుకు గురవుతున్నారన్నారు. 30 […]