UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

పదవ తరగతి ఫలితాల్లో పెంకె గీతిక విజయకేతనం….పలువురు అభినందనలు 

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం రామవరం ప్రాంతానికి చెందిన పెంకె గీతిక 10వ తరగతి ఫలితాలలో 560 మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేసింది.గీతిక తల్లి ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్,తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తున్నారు.ఇదే స్ఫూర్తి తో పై చదువులు చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని స్థానిక ప్రజలు పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.

పిల్లలలో మానసిక ధైర్యాన్ని నింపండి:-TSUTF ఇల్లందు మండల అధ్యక్షులు A.రాంబాబు.

పదవ తరగతి ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిరుత్సహా పడకుండా వారిలో మానసిక ధైర్యాన్ని కల్పించాలని TSUTF ఇల్లందు మండల అధ్యక్షులు ఆంగోతు రాంబాబు అన్నారు .ప్రతిభకు మార్కులకు సంబంధం లేదన్నారు. విద్యార్థులు ఫలితాలు ఎలా ఉన్నా ఆందోళన చెందకూడదానీ, ఇది జీవితంలో తొలి అడుగు మాత్రమేనని చెప్పారు.

పద్మశ్రీ వనజీవి రామయ్య అవార్డు అందుకున్న ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహన్.

పద్మశ్రీ వనజీవి రామయ్య అవార్డు అందుకున్న ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహన్.అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ వెలుగుమట్ల పార్కు లో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వారసురాలు శాంతాబాయి తో కలిసి మామిడి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మొక్కల వెంకటయ్య తదితరులు  పాల్గొన్నారు

ఉగ్ర దాడిలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తో మొక్కను నాటిన మొక్కల రాజశేఖర్ 

కాశ్మీర్ పహల్గావులో జరిగినటువంటి ఉగ్ర దాడిలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలుపుతూ వారందరి ఘన నివాళులు అర్పిస్తూ పచ్చని మొక్కను నాటిన తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకృతి హరిత దీక్ష మరియు గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు సింగరేణియన్ కె.ఎన్.రాజశేఖర్.కాశ్మీర్ లో ఉగ్రవాద దాడి హేయమైన చర్య అని ఆయన అన్నారు.

తెలంగాణ వాణి జర్నలిస్ట్ కు రాష్ట్రస్థాయి గౌరవం

మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు – 2025 అందుకున్న పిల్లి రవికిరణ్, మహమ్మద్ ఖాసీం, క్రాంతి కుమార్ మంచిర్యాల (తెలంగాణవాణి జిల్లా ప్రతినిధి) మంచిర్యాల జిల్లా జర్నలిస్టులు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆదివారం రాజమండ్రిలో అభిలాష హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు కార్యక్రమంలో ఉత్తమ జర్నలిస్టుల విభాగంలో రామకృష్ణాపూర్‌కు చెందిన తెలంగాణవాణి జర్నలిస్ట్ పిల్లి రవికిరణ్ తో పాటుగా మందమర్రి ప్రాంతానికి చెందిన మహమ్మద్ […]

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి కాలరీస్ డిస్టిక్ అసోసియేషన్ కొవ్వొత్తుల ర్యాలీ

కాశ్మీర్ పహల్గావులో జరిగినటువంటి ఉగ్ర దాడిలో మరణించిన వారికి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి కాలరీస్ డిస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో శాంతి ర్యాలీని నిర్వహించి అమర వీరుల స్థూపం వద్ద నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా డి వై పి.ఎం మరియు సింగరేణి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కమిషనర్ బి.సుశీల్,పి ఎం కే వరప్రసాద్, మరియు 40 మందికి పైగా రోవర్ స్కౌట్ లీడర్స్,స్కౌట్ మాస్టర్లు,స్కౌట్స్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకులు కె ఎన్ రాజశేఖర్ స్పూర్తితో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న శనగ కళ్యాణ్

చదివింది బీటెక్ చేసేది ప్రకృతి సేవ.. చదివే కాదు సేవలలో కూడా ముందుంటానని నిరూపించాడు కల్యాణ్ ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకులు కె ఎన్ రాజశేఖర్ స్పూర్తితో ప్రతి రోజు ఓ మొక్కను నాటుతున్నరాయన.ఈ నేపద్యంలో ప్రకృతి హరిత దీక్ష తీసుకొని 50 వ రోజున మరియు వివాహ వివహ వార్షికోత్సవం సందర్భంగా కొబ్బరి మొక్కను నాటిన ప్రకృతి ప్రేమికులు శనగ కళ్యాణ్ మణి దంపతులు. వాతావరణ సూచనలు మొక్కలు నడుపుతున్న కళ్యాణ్ దంపతులకు,ప్రకృతి మాత ఆశీర్వాదం […]

కొత్తగూడెం మున్సిపాలిటీ గ్రీన్ అంబాసిడర్ వెంకటయ్య కు ఎంఎల్ఏ కోరం కనకయ్య ఘనసన్మానం

గత 40సంవత్సరాలుగా మొక్కలు నాటుతూ కొన్ని లక్షల పైగా మొక్కలను పంచుతూ ఎంతోమంది ప్రకృతి ప్రేమికులకు సలహాలు సూచనలు ఇస్తూ ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి,బోకెలు బదులుగా మొక్కలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన  మొక్కల వెంకటయ్య దంపతులకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఘనంగా సన్మానించారు. ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేస్తూ ఆడంబరం చూపకుండా నిరాడంబరంగా ఉండే మొక్కల వెంకటయ్య అందరికి ఆదర్శం.

ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడిని అభినందించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

మంగళ వారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో పాల్వంచ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న లిక్కి కోటేశ్వరరావు కుమారుడు లిక్కి విశ్రుత్ 994 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ లిక్కి విశ్రుత్ ను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులు అభ్యసించి మంచి స్థాయికి ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్, పాల్వంచ […]

రాష్ట్ర స్థాయిలో ఆణిముత్యంలా మెరిసిన నవ్య శ్రీ.

మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన పాల్వంచ వాసి టి.నవ్య శ్రీ.468/470 మాకు సాధించి రాష్ట్ర స్థాయిలో ఆణిముత్యంలా మెరిసింది. ఈ సందర్భంగా పాల్వంచలోని తమ నివాస కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకున్నారు.ఈ సందర్భంగా వెంకట రమణ వేణు దంపతులు,ఐక్య తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్న,జిల్లా అధ్యక్షులు బాలునాయక్,టి.శ్రీనివాస్ తదితరులు అభినందన తెలిపారు