UPDATES  

NEWS

 గురుకుల పాఠశాల ఆవరణలో శ్రమదానం చేసిన మంత్రి పొంగులేటి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

మొక్కలు నాటిన మీనాక్షి నట రాజన్

పాల్వంచ (తెలంగాణ వాణి) మండలంలోని కిన్నెరసాని వద్ద గల గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి శనివారం ఉదయం శ్రమదానం చేశారు. ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి స్వయంగా పిచ్చి మొక్కలను తొలగించి, చెత్తను ఎత్తివేసి శుభ్రం చేశారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ ప్రాంగణంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మహబూబా బాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest