UPDATES  

సామాజిక వేత్త, రక్తదాన సంధానకర్తకు అవార్డు

ప్రాణదాత కటుకం గణేష్ కు జాతీయ సేవారత్న 2024 అవార్డు పురస్కారం కోరుట్ల (తెలంగాణ వాణి) అంజలి మీడియా గ్రూప్, అందరి టీవీ పదవ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కాకతీయ మహానంది 2024 అవార్డుల ప్రధానోత్సవం హన్మకొండలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ సామాజికవేత్త, రక్తదాన సంధాన కర్త, ప్రాణదాత కటుకం గణేష్ కు జాతీయ సేవా రత్న- 2024 అవార్డు చైర్మన్ కామిశెట్టి రాజు అందజే శారు. చైర్మన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ […]

జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్లోని పంచాయతీరాజ్ శాఖలో ఏసీబీ దాడులు

పట్టుబడ్డ ఈఈ దిలీప్ కుమార్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ ఏటీవో చంద్రశేఖర్, సీనియర్ అసిస్టెంట్ శోభారాణి జయశంకర్ భూపాలపల్లి (తెలంగాణ వాణి) మల్హార్ మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన సదానందం అనే కాంట్రాక్టర్ తాను పంచాయతీరాజ్ కు సంబంధించి చేసిన పనులకు నాలుగు లక్షల రూపాయలు రావాల్సి ఉన్నందుకు గాను. ముగ్గురు కలిసి 20000 డిమాండ్ చేశారు. దీంతో సదర్ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో గురువారం సాయంత్రం ఆకస్మిక దాడులు […]

నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ గంగారెడ్డి హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు జగిత్యాల (తెలంగాణ వాణి) తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని గంగారెడ్డి హత్యతో నాకెలాంటి సంబంధం లేదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విలేఖరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులని మాట్లాడుతున్నారని, ఇప్పటికీ కూడా నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని […]

అదుపులోకి తీసుకున్న నలుగురు ఆదివాసీలను విడుదల చేయాలి

పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ కరీంనగర్ (తెలంగాణ వాణి) టేకమెట్ల గ్రామాన్ని చుట్టుముట్టి మయాంద్ర సోధి, సోడి రాజ్ కుమార్, దేవా బార్సే, ఉర్ర కుంజమ్ నలుగురిని అరెస్టు చేసి ఉసూరు పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణ రావు తెలిపారు. నలుగురు ఆదివాసీలను పోలీసు బలగాలను ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా మహిళలు, […]

సీనియర్లను సిఎం నిర్లక్ష్యం చేస్తుండ్రు

నీకో దండం… నీ పార్టీకో దండం పార్టీ పిరాయింపుదారులే హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తుండ్రూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు జగిత్యాల (తెలంగాణ వాణి)     రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారు..నీకో దండం..నీ పార్టీకో దండం..పార్టీ పిరాయింపుదారులే హత్యారాజకీయాలు ప్రోత్సహిస్తుం డ్రని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సొంత కాంగ్రెస్ పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు […]

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి దారుణ హత్య

జగిత్యాల (తెలంగాణ వాణి) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణకు గురయ్యారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో చేస్తున్నారు. జీవన్ రెడ్డికి కుడి భుజం లాంటి మారు గంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గా కావలసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సొంత సోదరడుగా భావించే జాప్తాపూర్ గ్రామానికి చెందిన మారు గంగారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఉదయం పక్కా ప్రణాళిక ప్రకారం హత్యకు గురి కాగా ఒక్కసారి […]

ఒక్కసారిగా పెరిగిన గోదావరి వరద ఉధృతి

గోదావరిలో చిక్కుకున్న ఇసుక కార్మికులు కొట్టుకుపోయిన ట్రాక్టర్లు జగిత్యాల/మల్లాపూర్:అక్టోబర్ 21(తెలంగాణ వాణి) జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో ఒక్కసారిగా గోదావరికి వరద ఉదృతికి ట్రాక్టర్ లో ఇసుక నింపుతున్న కార్మికులు చిక్కుకుపోయారు. గోదావరి వరద నీరు ఎక్కువ రావడంతో నదిలో ఇరుక్కుపోయిన ట్రాక్టర్ వదిలేసిన డ్రైవర్ లేబర్ తో కలిసి ఒడ్డుకు చేరాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో గోదావరి నీటి ఉదృతి […]

రేపటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయండి

కొత్తగూడెం (తెలంగాణ వాణి) రేపు కొత్తగూడెంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో బీ‌ఆర్ఎస్ జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు కొట్టి వెంకటేశ్వర రావు తెలిపారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆదేశాల మేరకు కొత్తగూడెం తెలంగాణ భవన్ లో జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం జిల్లా […]

ఈటెల రాజేందర్ కొత్తగూడెం పర్యటన వాయిదాకు కారణమేంటి

జిల్లా నాయకుల మధ్య విభేదాలా ? అగ్రకుల నాయకుల రాజీనామా బెదిరింపులా ? కొత్తగూడెం (తెలంగాణ వాణి) అగ్రకులాల బెదిరింపులతో బీసీ వర్గానికి చెందిన ఓ ఎంపీ గొంతు మూగబోయిందా. ఇప్పుడు ఇదే విషయం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో చర్చనియాంశంగా మారింది. బీజేపీ జిల్లా పార్టీలో ఇలాంటి ఘటనల వల్ల పార్టీ పరువు పోవడం ఖాయమన్న సంగతి కూడ మర్చిపోయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీ గొంతుక, జాతీయ నాయకుడు, మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, మల్కాజ్గిరి […]

బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలవనపర్తి గ్రామానికి చెందిన నక్క బీమమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అనేక ఆసుపత్రిలలో చికిత్స చేపించుకున్న క్యాన్సర్ వ్యాధి నయం కాకపోవడంతో మనస్థాపం చెందిన నక్క భీమమ్మ దసరా రోజు సాయంత్రం 6 […]