UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

సర్పంచ్ గా భాద్యతలు చేపట్టిన ప్రేమేందర్

లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) సర్పంచిగా హమాలీ కాలనీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని నూతన సర్పంచ్ గా భాద్యతలు చేపట్టిన సర్పంచ్ గుగులోత్ ప్రేమేందర్ అన్నారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో భాద్యతలు చేపట్టిన సందర్భంగా సర్పంచ్ ప్రేమేందర్ మాట్లాడుతూ హమాలీ కాలనీ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా పాలకవర్గం సహకారంతో కలిసి గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి […]

ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేతాజీ రామవరం లో తిథి భోజనాలు

ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేతాజీ రామవరం లో ప్రధానోపాధ్యాయురాలు ద్రౌపతి ఆధ్వర్యంలో విజయలక్ష్మి, సులోచనల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ప్రతి ఏడాది విద్యార్థులకు తిథి భోజనాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పిల్లలకు భోజనం ఏర్పాటు చేయడం సంతోషం, సంతృప్తిని ఇస్తుందని విజయలక్ష్మి పేర్కొన్నారు.

నందా తండా గ్రామపంచాయతీ సర్పంచ్‌ మాలోత్ బలరాం కు ఘన సన్మానం

చుంచుపల్లి మండలం నందా తండా గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మాలోత్ బలరాం ఎన్నికైన సందర్భంగా స్థానిక గిరిజన సంఘాల నాయకులు, ఉద్యోగులు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. పంచాయతీ అభివృద్ధి కోసం అంకితభావంతో కృషి చేసి, రాబోయే రోజుల్లో నందా తండాను ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సన్శేమానించిన శేఖరం బంజర గ్రామ ప్రజలు

సిపిఐ పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాల్వంచలోని సిపిఐ కార్యాలయంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావును శేఖరం బంజారా గ్రామ ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఇస్లావత్ అనిల్ నాయక్‌,రంజిత్ నాయక్, నరేష్ నాయక్,రవి నాయక్, హరిబాబు నాయక్,కవిత,అనూష,భద్ర, హరిత,బుజ్జి,రూపదేవి, అనిత, యువతీ యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఏటీఎంల చోరీ జరిగిన సంఘటన స్థలాలను పరిశీలించిన ఇంచార్జి పోలీస్ కమిషనర్ ఎం రాజేష్ చంద్ర

ఐదు స్పెషల్ టీం ల ఏర్పాటు, ముమ్మరంగా తనిఖీలు భద్రత బలోపేతం కోసం బ్యాంకు అధికారులతో సమన్వయం నిజామాబాద్(తెలంగాణ వాణి) నిజామాబాద్ నగరంలో శనివారం తెల్లవారు జామున రెండు ఏటీఎంలలో చోరీ జరిగిన సంఘటన స్థలాలను శనివారం ఇంచార్జి పోలీస్ కమిషనర్ ఎం రాజేష్ చంద్ర పర్యవేక్షించారు. టౌన్ 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని పాంగ్ర బ్రాంచ్ కు సంబంధించిన డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ ఏ. టి. ఎమ్, టౌన్ 5 పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్ని […]

పాస్టర్ యు.అమృత రావు కు మొక్కలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి హారతి దీక్ష గౌరవ సలహాదారులు ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్

లక్ష్మీదేవి పల్లి మండలం సాటివారిగూడెంలోని త్రియేక దేవర్చనాలయం చర్చ్‌లో పాస్టర్ యు.అమృత రావు కు మొక్కలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి హారతి దీక్ష గౌరవ సలహాదారులు ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్ మాలోత్.ఈ కార్యక్రమంలో పాస్టర్ ఉంగటూరి అమృత రావు,ప్రభు భూషణం, వెంకట్రావు,జానయ్య, గుంటూరు రాంబాబు, ఏలియా,గడ్డం సురేష్, ఎం. రమేష్ తదితరులు పాల్గొన్నారు

త్రియేక దేవర్చనాలయం చర్చ్‌లో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు:పాస్టర్ యు.అమృత రావు

లక్ష్మీదేవి పల్లి మండలం సాటివారిగూడెంలోని త్రియేక దేవర్చనాలయం చర్చ్‌లో పాస్టర్ యు.అమృత రావు ఆధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులతో కలిసి దేవునికి మహిమ కలిగించేలా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.శాంతి,ప్రేమ, సోదరభావం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పాస్టర్ అమృత రావు కోరారు.ప్రజలందరూ ఏసు ప్రభు సూచించిన మార్గంలో నడవాలని అన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలు నాయక్, ప్రభు భూషణం,వెంకట్రావు, జానయ్య,రాంబాబు,ఏలియా,గడ్డం సురేష్,ఎం.రమేష్ తదితరులు పాల్గొన్నారు.

గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు

యేసుక్రీస్తు జన్మదినాన్ని స్మరిస్తూ రాబోయే క్రిస్మస్ పండగ భారతదేశ ప్రజలకు ఆనందం,ప్రేమ,శాంతి, సహనం ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ గిరిజన ఇంజనీరింగ్ శాఖ భద్రాచలం కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులంతా కలిసి వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెంకటస్వామి, కార్యాలయ సిబ్బంది భవాని బుచ్చలు, వెంకన్న, బుచ్చిబాబు,రాజేష్ తదితరులు […]

PRTU TS జిల్లా అసోసియేట్ అధ్యక్షులు టి.రవీందర్ కు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు

స్నేహసీలి,మృధుస్వభావి తను ఏ స్థానం ఉన్న అందరిని కలుపుకొని పోయే తత్త్వం, జిల్లాలో ఏ ఉపాధ్యాయుడికి ఇబ్బంది వచ్చిన నేనున్నాను,అని భరోసా కల్పించి పని చేసే గొప్ప వ్యక్తి PRTU TS జిల్లా అసోసియేట్ అధ్యక్షులు టి.రవీందర్ కు భద్రాది జిల్లాలోని పలువురు ఉపాధ్యాయుల సంఘం నేతలు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యాసదస్సును జయప్రదం చేయండి:అశ్వాపురం మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ చంద్రు

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు (విద్యా సదస్సును) జయప్రదం చేయండి. ప్రాథమిక పాఠశాల చవిటిగూడెంలో తెలంగాణ టిఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర విస్తృత సమావేశాలు మరియు విద్యా సదస్సు గోడపత్రిక ను టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి రాము,అశ్వాపురం మండల అధ్యక్షులు కారం సీతారామయ్య,ప్రధాన కార్యదర్శి ఈ.చందు, ఉపాధ్యక్షులు జి.సునీత ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బి.రాము మాట్లాడుతూ…విద్యా సదస్సులో తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల […]