ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ధర్మారం మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షునిగా బొమ్మగాని సతీష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షురాలు నాగవేల్లి జ్యోతి మహేష్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ఇంచార్జి తప్పట్ల మోహన్ మరియు నియోజకవర్గ ఇంచార్జి తీగల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ధర్మారం మండల కేంద్రంలోనీ గౌతమబుద్ధ ఫంక్షన్ హాల్ లో మండల వార్డు సభ్యుల ఫోరం సమావేశాన్ని నిర్వహించి పూర్తిస్థాయి మండల కమిటీని ఏర్పాటు చేశారు. ధర్మారం గ్రామ పంచాయతీ కి చెందిన 6వ వార్డు సభ్యులు బొమ్మగాని సతీష్ గౌడ్ మండల అధ్యక్షునిగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొమ్మ మహేందర్, ప్రధాన కార్యదర్శి గా రేషవేణి మహేష్, ఉపాధ్యక్షులుగా రెడపాక లక్ష్మణ్, మేకల కోమల్, చల్ల గంగారెడ్డి, కోమటిరెడ్డి తిరుపతి రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా ఇస్లావత్ రాజేందర్ నాయక్, కాదాసి ప్రసాద్, కోరే మహేష్, గుంటి సంతోష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నెవనందులా వెంకటేష్ ఎన్నిక అయ్యారు. మహిళా వార్డు సభ్యుల ఫోరం అధ్యక్షురాలిగా ఇందూరి శిరీష నియామకం అయ్యారు. ప్రధాన కార్యదర్శి గా సిరికొండ మమత, ఉపాధ్యక్షురాలిగా రెండ్ల అనిత, ముద్ద పుష్ప, అరుగుల వెంకటేశ్వరి, జాయింట్ సెక్రటరీలుగా సాద మౌనిక, అర్డవెల్లి రజిత, సెక్రటరీలుగా గూడెపు స్వరూప, బోట్ల విజయ నియామకం అయ్యారు. మండల అధ్యక్షునిగా నియామకం అవ్వడం పట్ల కమిటీ ప్రతినిధులకు, వార్డు సభ్యులకు బొమ్మగాని సతీష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. వార్డు సభ్యుల హక్కుల కోసం కృషి చేస్తానని తెలిపారు.





