సీఎం జన్మదిన వేడుకలు పాల్గొన్న మంత్రి అడ్లూరి
ధర్మారం,నవంబర్ 08 (తెలంగాణ వాణి ) ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతామని, రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల తో పాటు దీపావళి వేడుకలను ధర్మారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు లావుడ్య రూప్ల నాయక్ అద్వర్యం లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొని కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం బెడ్డల నాగమణి బానేష్, తమ్మడవేని సరిత- రాజలింగు దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి వద్ద దీపావళి వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. పేదల నాయకుడు రేవంత్ రెడ్డి అని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి ని దేవుడు చల్లగా చూడాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు తో పాటు దీపావళి పండుగ ఒకేరోజు రావడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురి నియోజకవర్గానికి మొదటి విడతలో 2500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసామని, రెండో విడతలో మరో రెండు వేల ఇళ్లను నిర్మిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడానికి ఇప్పటివరకు ధర్మపురి నియోజకవర్గంలో సుమారుగా రూ.275 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ధర్మారం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు ధర్మారం మండలంలో క్రీడా మైదానం నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించి రైతుల ఆకాంక్షలను నెరవేర్చుతామని మంత్రి తెలిపారు. చామనపల్లి గ్రామాన్ని 100% ముంపు గ్రామంగా తీసుకొని పరిహారం చెల్లించడానికి రూ. 350 కోట్ల జీవో విడుదల చేసినట్లు మంత్రి ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ధర్మారం మండల పార్టీ అధ్యక్షుడు రూప్ల నాయక్ తో పాటుసర్పంచ్ దాగేటి రాజేశ్వరి,జిల్లా ప్రధాన కార్యదర్శి గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, జిల్లా కార్యదర్శి కొత్త నర్సింహులు, నాయకులు కొడారి హన్మయ్య, మేడవేణి తిరుపతి, చింతల ప్రదీప్ రెడ్డి,నోముల వెంకట రెడ్డి, అరిగే లింగన్న, కాడే సూర్యనారాయణ, పాలకుర్తి రాజేశం, దాగేటి ఉదయ్, దేవి జనార్దన్,అశోద అజాయ్,సొగల తిరుపతి, రేవంత్ అభిమాని ఒరేం చీరంజీవి, నాగరాజు, ఉపసర్పంచ్ ఎలిగేటి మల్లేశం, ఒడ్నాల శంకరయ్య, పొలు దాసరి సంతోష్, పట్టణ అధ్యక్షులు తుమ్మల తిరుపతి, దేవి లావణ్య మండలంలో ని వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




