UPDATES  

 గ్రామ సమస్యలపై సర్వసభ సమావేశంలో గళమెత్తిన సర్పంచులు

రాయికోడ్, నవంబర్ 6 (తెలంగాణ వాణి ప్రతినిధి) రాయికోడ్ మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని పలువురు సర్పంచులు అధికారులను కోరారు. గురువారం రాయికోడ్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో షరీఫ్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో గ్రామాల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, అంగన్‌వాడీ భవనాలు, రేషన్ సరఫరా తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిమ్నాపూర్ గ్రామంలో హైస్కూల్ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారి నరసింహులు ప్రతిపాదించారు. పంటల నమోదు గడువును పొడిగించాలని వ్యవసాయ అధికారి సారిక కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య మాట్లాడుతూ రాయికోడ్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడం సంతోషకరమన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో రహదారుల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. మండల ప్రత్యేక అధికారి జగదీష్ మాట్లాడుతూ తాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులు, సర్పంచులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తహసీల్దార్ అనుమతి లేకుండా ఎవరూ బోర్లు వేయరాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ ఆశాజ్యోతి, విద్యాశాఖ అధికారి నరసింహులు, ఎంపీవో సంతోష్, వివిధ శాఖల అధికారులు, గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 6 November 2026, 8:52 am Posted by : TELANGANA VANI

గ్రామ సమస్యలపై సర్వసభ సమావేశంలో గళమెత్తిన సర్పంచులు

రాయికోడ్, నవంబర్ 6 (తెలంగాణ వాణి ప్రతినిధి) రాయికోడ్ మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని పలువురు సర్పంచులు అధికారులను కోరారు. గురువారం రాయికోడ్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో షరీఫ్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో గ్రామాల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, అంగన్‌వాడీ భవనాలు, రేషన్ సరఫరా తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిమ్నాపూర్ గ్రామంలో హైస్కూల్ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారి నరసింహులు ప్రతిపాదించారు. పంటల నమోదు గడువును పొడిగించాలని వ్యవసాయ అధికారి సారిక కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య మాట్లాడుతూ రాయికోడ్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడం సంతోషకరమన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో రహదారుల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. మండల ప్రత్యేక అధికారి జగదీష్ మాట్లాడుతూ తాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులు, సర్పంచులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తహసీల్దార్ అనుమతి లేకుండా ఎవరూ బోర్లు వేయరాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ ఆశాజ్యోతి, విద్యాశాఖ అధికారి నరసింహులు, ఎంపీవో సంతోష్, వివిధ శాఖల అధికారులు, గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest