UPDATES  

 పూడ్చిన మృతదేహం వెలికితీత.. పోస్ట్ మార్టం

ధర్మారం, అక్టోబర్ 11 (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన గంగాధర నడిపి లక్ష్మి 55 శనివారం తన ఇంట్లోతెల్లవారు జామున అనుమాన స్పద స్థితిలో మృతి చెందగా కుటుంబ సభ్యులు హడావిడిగా అంత్యక్రియలుచేశారు. అత్త చనిపోయిన విషయం కోడలు పుష్పలత కాలనీవాసులతో చెప్పగా ఒకరిద్దరూ ఇంటికి వెళ్లి చూసేసరికి లక్ష్మీ మెడకు చున్ని చుట్టి ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ ఎంబడి శ్రీకాంత్ మృతురాలి ఇంటికి వెళ్లి విచారణ చేపట్టి ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. లక్ష్మి అనుమానస్పద మృతితో గ్రామంలో పలు రకాలుగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక తహసీల్దార్ దురిశెట్టి శ్రీనివాస్, పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్, స్థానిక ఎస్సై ఎంబడి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం ధర్మారం మండల కేంద్రంలోని బోడ గుట్ట వెనకాల సర్వే నంబర్ 476లో లక్ష్మీ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలానికి చేరుకున్న అధికారులు గ్రామపంచాయతీ సిబ్బంది సహాయంతో పూడ్చిపెట్టిన మృతదేహాన్నివెలికి తీసి అక్కడికక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్తీక్ సహాయంతో పోస్టుమార్టం నిర్వహించారు. పూర్తిస్థాయి విచార చేపట్టిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని సీఐ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. పోస్టుమార్టం వద్దకు లక్ష్మి కుమారుడు వెంకటేష్ ఇతర కుటుంబ సభ్యులు హాజరుకాగా కోడలు పుష్పలత అక్కడికి రాకపోవడంపై స్థానికులు బగ్గుమన్నారు. గత మూడు నెలలుగా తన తల్లి లక్ష్మి అనారోగ్యంతో ఇంటివద్దనే ఉంటుందని మృతురాలి కుమారుడు వెంకటేష్ అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వగా అక్కడే ఉన్న స్థానికులు మాట్లాడుతూ.. లక్ష్మీ శుక్రవారం కూడా ఉపాధి హామీ పనులకు హాజరైందని మరుసటి రోజే శవంగా మారడం బాధాకరం పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిందితులపై చర్య చేపట్టాలని కోరారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 12 October 2026, 8:20 am Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest