బండపల్లి, సెప్టెంబర్ 10 (తెలంగాణ వాణి ప్రతినిధి):అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మంజుల, శేఖర్, రజిత కుటుంబాలు ఎట్టకేలకు నూతన ఇళ్లలోకి అడుగుపెట్టారు. నూతనంగా నిర్మించిన ఇళ్లకు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ కటకం మల్లేశం, ఉపసర్పంచ్ ఈసాక్తో పాటు గ్రామ పెద్దలు హాజరై బాధిత కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. అగ్ని ప్రమాదంతో సర్వం కోల్పోయిన కుటుంబాలు తిరిగి సొంతింటిలో అడుగుపెట్టడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. నూతన ఇళ్లలో కుటుంబాలు సుఖసంతోషాలతో జీవించాలని గ్రామ పెద్దలు ఆకాంక్షించారు.
Post Views: 9




