UPDATES  

NEWS

 అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీజేపీ ఆందోళన

తిమ్మాపూర్‌, సెప్టెంబర్‌ 3 (తెలంగాణవాణి ప్రతినిధి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్టును నిరసిస్తూ తిమ్మాపూర్‌ మండల బీజేపీ, దళిత మోర్చా ఆధ్వర్యంలో గురువారం తిమ్మాపూర్‌ స్టేజీ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి, రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టు అప్రజాస్వామికమని నాయకులు ఆరోపించారు. రవీంద్రనాథ్‌ సంతదాస్‌పై నల్లరంగు చల్లిన ఘటనకు బాధ్యులైన కాంగ్రెస్‌ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు చింతం శ్రీనివాస్‌, దళిత మోర్చా అధ్యక్షుడు ఎలుకపల్లి స్వామి, బొంతల కళ్యాణ్‌చంద్ర, సంపత్‌కుమార్‌, బూట్ల శ్రీనివాస్‌, బోనాల మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Date of Publish : 4 September 2026, 1:56 am Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest