వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి తైవాన్ మామిడి మొక్క నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ పండుగలను ప్రకృతితో మమేకం చేయాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. వేలాది మొక్కలు నాటి పచ్చదనం కోసం కృషి చేస్తున్న విశ్వామిత్ర చౌహాన్‌ను అభినందించారు.విశ్వామిత్ర చౌహాన్ నాటిన ఈ మొక్క 1541వ మొక్క కావడం విశేషం. కార్యక్రమంలో బంజారా సంఘాల జేఏసీ చైర్మన్ వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 4


