ధర్మారం, ఆగస్ట్ 09 (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మేడారం గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీని శనివారం సాయంత్రం ఎన్నుకున్నట్లు ఇంచార్జ్ ప్రిన్సిపల్ పద్మ తెలిపారు. చైర్మన్ గా చుంచు పుష్పలత, వైస్ చైర్మన్ గా లంకదాసరి భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ఆర్ ప్రేమలత, ట్రెజరర్ గా ఏదుల్ల సంధ్య, జాయింట్ సెక్రటరీగా ఎం పుష్పలత లను ఎన్నుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ పద్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపల్ విజయ, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ కరుణ, ఉపాధ్యాయురాలు కిరణ్మయి పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ సుజాత మాట్లాడుతూ.. పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని విద్యార్థుల మౌలిక వసతుల కల్పనకు తోడ్పడుతానని తెలిపారు.
Post Views: 312


