భక్తుల ప్రత్యేక పూజలు
ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి గ్రామంలో పురాతన సాంబమూర్తి దేవాలయంలోని గర్భగుడిలో ఆదివారం తెల్లటి శ్వేత నాగుపాము దర్శనమిచ్చింది. ఆదివారం ఉదయం దేవాలయానికి పూజలు చేసేందుకు వెళ్లిన పూజారికి ఆలయం గర్భగుడిలో నాగసర్పం ఉన్న విగ్రహాలకు ఎదురుగా నాగుపాము ఉండటం చూసిన పూజారి కొంత భయాందోళనకు గురయ్యారు. స్థానిక సర్పంచ్ సూర రజిత వెంకటేశం, కొండగట్టు ఆలయ కమిటీ మాజీ డైరెక్టర్ కొలుముల దామోదర్ తో పాటు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన భక్తులు సాంబమూర్తి ఆలయానికి చేరుకొని నాగుపామును ఆసక్తిగా చూశారు. కొంతమంది భక్తులు ధైర్యంచేసి నాగుపాము కు ప్రత్యేక పూజలు చేశారు. గతంలో ఇలాగే కొన్ని పురాతన ఆలయాలు, శివాలయాలు కావడం వల్ల చుట్టూ పక్కల పరిసరాలు వాటికి అనుకూలంగా ఉండటంతో పాములు కనిపించడం సహజం, శాస్త్రీయంగా మూఢనమ్మకంతో మూడి పెట్టకూడదనేది విశ్లేషకుల వాదన.


