UPDATES  

 తప్పిన ప్రమాదం రాకపోకలకు అంతరాయం

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఘోర ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ధర్మానం వైపు నుండి కరీంనగర్ వైపు లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బ్రిడ్జి డివైడర్ ను ఢీకొని స్టీరింగ్ విరిగిపోయి రోడ్డు మీద నిలిచిపోయింది. లారీలో ఉన్న డ్రైవర్ క్లీనర్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ బ్రిడ్జిపై మూడు గజాల వెనక్కి ఈ ప్రమాదం జరిగితే లారీ పూర్తిగా ఎస్సారెస్పీ పెద్ద కాలువలో పడి ప్రాణానష్టం జరిగేది. అసలే ఇరుకైన ఈ బ్రిడ్జిపై లారీ నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం జరుగుతుంది. వెంటనే లారీని పక్కకు తొలగించి ప్రమాదాలను నివరించాలని స్థానికుల వాదన.

Date of Publish : 1 July 2026, 1:16 pm Posted by : TELANGANA VANI

తప్పిన ప్రమాదం రాకపోకలకు అంతరాయం

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఘోర ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ధర్మానం వైపు నుండి కరీంనగర్ వైపు లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బ్రిడ్జి డివైడర్ ను ఢీకొని స్టీరింగ్ విరిగిపోయి రోడ్డు మీద నిలిచిపోయింది. లారీలో ఉన్న డ్రైవర్ క్లీనర్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ బ్రిడ్జిపై మూడు గజాల వెనక్కి ఈ ప్రమాదం జరిగితే లారీ పూర్తిగా ఎస్సారెస్పీ పెద్ద కాలువలో పడి ప్రాణానష్టం జరిగేది. అసలే ఇరుకైన ఈ బ్రిడ్జిపై లారీ నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం జరుగుతుంది. వెంటనే లారీని పక్కకు తొలగించి ప్రమాదాలను నివరించాలని స్థానికుల వాదన.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest