కొత్తగూడెం కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటరమణ ఆయుర్వేదిక్ హాస్పిటల్ లో ఆదివారం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ రాయపాటి మానస, డాక్టర్ వేణు ఆహ్వానం మేరకు కొత్తగూడెం కార్పొరేషన్ 56వ డివిజన్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ 24వ వార్డు కౌన్సిలర్ బాలశెట్టి సత్యభామ క్యాంపును సందర్శించారు. వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను ఆమె సన్మానించారు.ఈ సందర్భంగా డాక్టర్లు కూడా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ బాలశెట్టి సత్యభామను సన్మానించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఇటువంటి క్యాంపులు మరింతగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Post Views: 20