UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 గిరిజన మహిళ ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి

అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టిన వారిపై చర్యలేవి

చాతకొండ ఇసుక అక్రమ రవాణా బాధితురాలికి న్యాయం చేయండి

జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ 

కొత్తగూడెం (తెలంగాణ వాణి) లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ బిసి కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టడమే కాకుండా గిరిజన మహిళ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. ఇసుక లోడ్ చేస్తుండగా ప్రమాదానికి గురై జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చుంచుపల్లి తండాకు చెందిన అజ్మీరా పద్మను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అనుమతులు లేకుండా విచ్చల విడిగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడని విమర్శించారు. గిరిజన మహిళకు ప్రమాదం జరిగి, కాలు ఎముక రెండు చోట్ల విరిగి వారం రోజులు కావస్తున్నా మహిళకు మెరుగైన వైద్యం అందించకుండా అధికార పార్టీ అండదండలతో మహిళను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చేతులు దులుపుకోవడం సరైంది కాదన్నారు. జిల్లా కేంద్రంలో యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా చేసి ఎక్కడ పడితే అక్కడ ఇసుక నిల్వలు ఏర్పాటు చేసుకుంటున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. అధికారులు వెంటనే స్పందించి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడటమే కాకుండా గిరిజన మహిళ ప్రమాదానికి కారణమైన సదరు వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అదేవిధంగా గిరిజన మహిళకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, అంతేకాకుండా ఆ కుటుంబానికి ఆర్థిక చేయూత ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉందని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అజ్మీరా రాములు, శివ, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

Editor Reporter
telanganavanidaily.com

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest