యేసుక్రీస్తు జన్మదినాన్ని స్మరిస్తూ రాబోయే క్రిస్మస్ పండగ భారతదేశ ప్రజలకు ఆనందం,ప్రేమ,శాంతి, సహనం ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ గిరిజన ఇంజనీరింగ్ శాఖ భద్రాచలం కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులంతా కలిసి వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెంకటస్వామి, కార్యాలయ సిబ్బంది భవాని బుచ్చలు, వెంకన్న, బుచ్చిబాబు,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 7