UPDATES  

NEWS

మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

 క్రిప్టో కరెన్సీకి మోసానికి ప్రభుత్వ డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య

స్నేహితులను నమ్మి ఫండ్ లో పెట్టుబడి పెట్టి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

కరీంనగర్ (తెలంగాణ వాణి) కరీంనగర్ నగరంలో క్రిప్టో కరెన్సీ మోసానికి ప్రభుత్వ వైద్యులు బలయ్యారు. ప్రతిమ ఆసుపత్రిలో అనస్తీషియా (మత్తు ) వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ఎంపటి శ్రీనివాస్ మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు.

మంకమ్మ తోటకు చెందిన శ్రీనివాస్ గతంలో చొప్పదండి మెడికల్ ఆఫీసర్ గా పనిచేశాడు. శ్రీనివాస్ భార్య విప్లవశ్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. తరచూ బ్యాంక్ అధికారులు ఇంటికి రావడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని భార్య విప్లవశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేహితులతో కలిసి మెటా ఫండ్ లో డబ్బులు పెట్టాడని, కరుణాకర్, కిరణ్, గణేష్ అనే స్నేహితులకు కోట్లలో డబ్బులు ఇచ్చాడని భార్య ఆరోపించారు. తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ ఉద్యోగుల వేధింపులు, స్నేహితులు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు బందువులు తెలిపారు. పలురకాల బిజినెస్ లలో గణేష్, కిరణ్, కరుణాకర్ లు శ్రీనివాస్ తో డబ్బులు పెట్టించి మోసం చేశారని ఆరోపించారు. వైద్య వృత్తిలో ఉండడంతో బ్యాంక్ రుణాలు తీయించారని చెప్పారు. సుమారు మూడు కోట్ల రూపాయల వరకు అప్పులు అయినట్లు తెలిపారు. గత పదేళ్లుగా ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest