UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

 రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థిని పరామర్శించిన టిజిపిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు దార మధు

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) మండల కేంద్రానికి చెందిన చిలుముల సాయి చరణ్ ఈ నెల 11న బంకేట్ హాల్ ముందు తన తండ్రి బైక్ పంచరై ఉండగా అట్టి బైకును రోడ్డు ఇవతల నుండి అవతల తన ఇంటి వైపుకు తోసుకుంటూ వెళుతుండగా పోలీస్ స్టేషన్ వైపు నుండి రాజారాంపల్లి వైపు వెళ్తున్న హుందాయి. ఐ20 కార్ నంబర్ ఏపి 29 సిబి 419 గల దానిని నడుపుకుంటూ వస్తున్న జిల్లా లోని మంథని పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయులు రాజేందర్ అను ఆతను అతివేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టగా ఎగిరి నాలుగు గజాల దూరంలో పడి కుడికాలు మడమ భాగంలో తల వెనుక భాగంలో తీవ్ర రక్త గాయాలు అయినాయి. గాయపడ్డ విద్యార్ధి కరీంనగర్ లోని ఆరోగ్య ఆసుపత్రి లో చికిత్స పొంది ఆదివారం రాత్రి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర నిజ నిర్ధారణ కమిటి కన్వీనర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జీ దార మధు బాధితుని ఇంటికి వెళ్లి పరమార్శించి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం యాక్సిడెంట్ చేసిన రాజేందర్ తో చరవాణిలో మాట్లాడి విద్యార్థికి అయిన ఆసుపత్రి ఖర్చులు భరించాలని తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest