UPDATES  

NEWS

చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి

 హుస్నాబాద్‌లో జీవో 317 బాధితుల ముందస్తు అరెస్టులు

పండుగ పూట ఉపాధ్యాయుల ఇబ్బందులు

​సిద్దిపేట/హుస్నాబాద్: (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పరిధిలో నివసిస్తున్న జీవో 317 ప్రభుత్వ ఉపాధ్యాలను హుస్నాబాద్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. జీవో 317 ద్వారా బదిలీకాని ఉద్యోగులందరినీ స్థానికత ఆధారంగా బదిలీ చేయాలనే డిమాండ్‌తో వారు శనివారం హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే జీవో 317 ద్వారా ‘డిస్లొకేట్’ అయి బాధితులు అయిన ఉపాధ్యాయులను అరెస్టు చేయడం పట్ల పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బూట్ల రాజామల్లయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317 బాధితులందరినీ ఒకే రకంగా చూడడం సరికాదని ఆయన అన్నారు. ఇటీవల ప్రభుత్వం జీవో 190 విడుదల చేసినప్పటికీ, ముందస్తు అరెస్టులు చేయడంలో అర్థం లేదని రాజామల్లయ్య ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి అరెస్టులు చేయడం పోలీసులు మానుకోవాలని ఆయన సూచించారు. అరెస్టైన వారిలో ఉపాధ్యాయులు కక్కెర్ల రవీందర్, కాయిత శ్రీనివాస్ రెడ్డి అయిల బాలకిషన్ లు ఉన్నారు. ఈ అరెస్టుల కారణంగా పండుగ పూట ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది.

Date of Publish : 27 September 2025, 10:26 am Posted by : TELANGANA VANI

హుస్నాబాద్‌లో జీవో 317 బాధితుల ముందస్తు అరెస్టులు

పండుగ పూట ఉపాధ్యాయుల ఇబ్బందులు

​సిద్దిపేట/హుస్నాబాద్: (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పరిధిలో నివసిస్తున్న జీవో 317 ప్రభుత్వ ఉపాధ్యాలను హుస్నాబాద్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. జీవో 317 ద్వారా బదిలీకాని ఉద్యోగులందరినీ స్థానికత ఆధారంగా బదిలీ చేయాలనే డిమాండ్‌తో వారు శనివారం హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే జీవో 317 ద్వారా 'డిస్లొకేట్' అయి బాధితులు అయిన ఉపాధ్యాయులను అరెస్టు చేయడం పట్ల పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బూట్ల రాజామల్లయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317 బాధితులందరినీ ఒకే రకంగా చూడడం సరికాదని ఆయన అన్నారు. ఇటీవల ప్రభుత్వం జీవో 190 విడుదల చేసినప్పటికీ, ముందస్తు అరెస్టులు చేయడంలో అర్థం లేదని రాజామల్లయ్య ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి అరెస్టులు చేయడం పోలీసులు మానుకోవాలని ఆయన సూచించారు. అరెస్టైన వారిలో ఉపాధ్యాయులు కక్కెర్ల రవీందర్, కాయిత శ్రీనివాస్ రెడ్డి అయిల బాలకిషన్ లు ఉన్నారు. ఈ అరెస్టుల కారణంగా పండుగ పూట ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest