UPDATES  

NEWS

నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ హర్ష టౌన్షిప్‌లో టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్‌ లకు ఘన సన్మానం లక్ష్మీదేవిపల్లిలో వీధి దీపాల ఏర్పాట్లు వేగవంతం: సర్పంచ్ తాటి అనిత 56వ డివిజన్‌లో మెగా మెడికల్ క్యాంపు..ఉచిత మందుల పంపిణీ హమాలికాలనీ గ్రామంలో కొత్త కరెంటు పోల్స్‌పై వీధి దీపాల ఏర్పాటు లక్ష్మీదేవిపల్లి బాలమేళాలో రాజాపురం పాఠశాల విద్యార్థుల ప్రతిభ ఖమ్మంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఘనంగా సైన్స్ దినోత్సవం

 హుండీ దొంగను పట్టుకున్న ఎస్సై ప్రవీణ్ కుమార్

ధర్మారం (తెలంగాణ వాణి)

గత కొంతకాలంగా పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం, సుల్తానాబాద్, పొత్కపల్లి మండలాలలో వివిధ గ్రామాల్లోని పలు దేవాలయాలలో ఉన్న హుండీలు పగులగొట్టి దొంగతనాలు చేస్తున్న కూకట్ల సదానందం ను పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతను దేవాలయాలలోని హుండీలే లక్ష్యంగా చేసుకొని వాటిని పగలగొట్టి అందులో ఉన్నవి దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. గురువారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో సదానందం ధర్మారం మార్కెట్ యార్డ్ వద్ద తచ్చాడుతుండగా అతన్ని స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ తన పోలీసు సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకొని రిమాండ్ కు పంపినట్లు ఎస్సై తెలిపారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ మండలంలోని ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest