UPDATES  

NEWS

కూలీలైన్ మసీదు యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు టి ఎస్ యు టి ఎఫ్ అద్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం .. రోజు మొక్కతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ విశ్వామిత్ర చౌహాన్ ఖమ్మంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ విద్యార్థుల ఐఎన్‌టీఎస్ఓ ఒలింపియాడ్ పరీక్షలు విద్యార్థుల ప్రతిభ.. సారపాకలో బి ప్రకాష్ రావు మాతృమూర్తి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న టి ఎస్ యు టి ఎఫ్ భద్రాది జిల్లా నాయకులు  లక్ష్యం దిశగా దూసుకుపోవాలి: జె.ఎన్.ఎస్ స్టేడియంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు ! ప్రభుదయాల్‌ పాత అనుబంధాలతో సింగరేణి సి.యం.డి ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్ భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య

 జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయండి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు డీజేయూ వినతి

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

భద్రాద్రి జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు అయ్యేలా చూడాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీ కన్వీనర్ సీమకుర్తి రామకృష్ణ, కో-కన్వీనర్ అఫ్జల్ పఠాన్ వినతి పత్రం అందిచారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో, చానళ్ళలో రిపోర్టర్లుగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారన్నారని, అందులో చాలామంది పేదరికంతో ఉన్న కుటుంబాలే ఎక్కువగా ఉండగా కనీసం సొంత ఇల్లు లేక కిరాయి ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో జర్నలిస్టులు సతమతమవుతున్నారన్నారు. సొంత ఇల్లు లేని జర్నలిస్టులకు అద్దె చెల్లించడం భారంగా మారిందని, గత ప్రభుత్వం కొత్తగూడెం జర్నలిస్ట్ ల కోసం స్థలాన్ని సేకరించినప్పటికీ ఆ స్థలాన్ని సొసైటీకి అప్పగించడంలో జాప్యం చేసిన విషయాన్ని మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, ఇళ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఇందిరమ్మ రాజ్యంలోనైన జిల్లాలో అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వెంటనే వారికి ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ తరపున విన్నవించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest