UPDATES  

NEWS

రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ కు మొక్కలు అందజేసిన వైభవంగా సర్వారం ఒడ్డుగూడెం తండాలో కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట టీఎస్ యుటిఎఫ్ భద్రాచలం మండల కమిటీ నుంచి ఎంఈఓకు ప్రాతినిధ్యం కొత్తగూడెంలో నయా ల్యాబ్‌ దందా ? అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది రమేష్ నాయక్ బాణోత్‌ ముందస్తు అరెస్ట్ లయన్స్ క్లబ్ ఆఫ్ టేకులపల్లి ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ వెరిస్క్ అనలిటిక్స్ కంపెనీ సహకారంతో సుమారు రూ.3.5 లక్షల వ్యయంతో గిరిజన పాఠశాలకు అభివృద్ధి పనులు అందరూ సోదర భావంతో ముందుకు సాగుదామని,ఇఫ్తార్ విందులో జర్పుల మురళీ నాయక్

 ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి

పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్)

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది తెలంగాణ హైకోర్టు. సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ పెరిగిపోయింది. అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

ఇదిలాఉంటే.. బీఆర్ఎస్‌ పార్టీ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్‌ తో పాటు.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల తీర్పులను, ఫిరాయింపు చట్టం నిబంధనలను కోర్టు దృష్టి తీసుకెళ్లారు.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. పలు దఫాలుగా వాదనలు విన్నది. అనంతరం తీర్పును సోమవారం ఉదయానికి వాయిదా వేసింది. ఈ కేసులో హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది న్యాయస్థానం. మరి స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీరే.. దానం నాగేందర్ – ఖైరతాబాద్,  ప్రకాష్ గౌడ్ – రాజేంద్రనగర్, గూడెం మహిపాల్ రెడ్డి – పటాన్ చెరు, కాలె యాదయ్య – చేవెళ్ల, అరికెపూడి గాంధీ – శేరిలింగంపల్లి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి – గద్వాల్, ఎం సంజయ్ కుమార్ – జగిత్యాల, పోచారం శ్రీనివాస్ రెడ్డి – బాన్సువాడ, తెల్లం వెంకట్రావు – భద్రాచలం, కడియం శ్రీహరి – స్టేషన్ ఘన్‌పూర్…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest