UPDATES  

NEWS

 తెలంగాణ జెన్కో కీలక ప్రకటన.. పరీక్షలు వాయిదా

: తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (TS GENCO) కీలక ప్రకటన చేసింది. ఈ నెల 31న జరుగాల్సిన ఏఈ మరియు కెమిస్ట్ ఉద్యోగ నియామకాల పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. కాగా, తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TS GENCO)లో 339 అసిస్టెంట్ ఇంజినీర్ (AE), 60 కెమిస్ట్‌ (Chemist) పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు గతేడాది నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 399 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. వివిధ కారణాల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఎగ్జామ్.. తాజాగా ఎన్నికల కారణంగా మరోసారి వాయిదా పడింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest