UPDATES  

NEWS

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

 ఇక ‘నెట్’ స్కోర్‌తోనూ పీహెచ్‌డీ అడ్మిషన్లు

పీహెచ్‌డీ అడ్మిషన్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) స్కోర్లను పరిగణనలోకి తీసుకోవచ్చని వెల్లడించింది.

మార్చి 13న యూజీసీ 578వ సమావేశం ఢిల్లీ వేదికగా జరిగింది. యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన నిబంధనలపై నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులపై ఈ మీటింగ్‌లో కూలంకషంగా చర్చించి.. పీహెచ్‌డీ అడ్మిషన్లు ఇచ్చేందుకు నెట్ స్కోరును లెక్కలోకి తీసుకోవచ్చని తీర్మానించారు. ఒకే రకమైన కోర్సులలో అడ్మిషన్ల కోసం ఒకటికి మించి ప్రవేశ పరీక్షలను నిర్వహించకూడదని జాతీయ విద్యా విధానం చెబుతోంది. ఈ నిబంధన అమలులో భాగంగానే తాజా నిర్ణయాన్ని యూజీసీ తీసుకుంది. ప్రస్తుతానికి నెట్ పరీక్ష స్కోరును జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) అర్హత కోసం, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల కోసం పరిగణనలోకి తీసుకుంటున్నారు.

ఇదీ ప్రాసెస్..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ప్రతి సంవత్సరం జూన్, డిసెంబర్‌లలో నెట్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంటారు. యూజీసీ నెట్ జూన్ -2024 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. జూన్ 2024 నుంచి యూజీసీ నెట్‌లో అర్హత సాధించే అభ్యర్థులను మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. జేఆర్ఎఫ్‌తో పీహెచ్‌డీ అడ్మిషన్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ అపాయింట్‌మెంట్లకు అర్హులైన వారు మొదటి కేటగిరిలో ఉంటారు. జేఆర్ఎఫ్ లేకుండా పీహెచ్‌డీ అడ్మిషన్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ అపాయింట్‌మెంట్లకు అర్హులైన వారు రెండో కేటగిరిలో ఉంటారు. కేవలం పీహెచ్‌డీ అడ్మిషన్‌కే అర్హతను కలిగినవారు మూడో కేటగిరిలో ఉంటారు.నెట్ స్కోర్ ద్వారా పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం కేటగిరి రెండు, మూడులో ఉండే అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. వారి నెట్ స్కోర్‌ను 70 శాతం, పీహెచ్‌డీ ఇంటర్వ్యూలో వచ్చే మార్కులను 30 శాతం కలుపుకొని పీహెచ్‌డీ అడ్మిషన్‌పై నిర్ణయం తీసుకుంటారు. నెట్ స్కోర్ ఏడాదికాలం పాటు చెల్లుబాటు అవుతుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest