ప్రమాదకరమని తెలిసినా ఎలా పంపిస్తారు
ధర్మారం: ఆగస్టు 27 (తెలంగాణ వాణి విలేకరి)
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి విగ్రహాలను ధర్మారం మండల కేంద్రం నుండి ఆయా గ్రామాలకు తరలించే క్రమములో ట్రాక్టర్లు, టాటా ఏసీలు, ఆటోలలో 7,8 సంవత్సరాల వయస్సున్న బాలలు పాల్గొని ఘననాధులను తరలిస్తున్నారు. ఇందులో పిల్లలు పాల్గొనడం ఎంత ప్రమాదకరమో తల్లిదండ్రులు గమనించాలి. ప్రతి గణపతి తరలింపులో పదేళ్లు కూడా నిండని పిల్లలు ఇలలు ఊదుతూ, కేరింతలు కొడుతూ దప్పు చప్పులతో తరలిస్తున్నారు. ఒక్కో సందర్భంలో ట్రాక్టర్ కు ఎదురుగా ఏదైనా సడన్ గా వస్తే ఆ క్రమంలో స్పీడ్ బ్రేక్ వేస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించి పిల్లలను గణనాధులను తరలించేందుకు పంపకూడదని వారంటున్నారు.
Post Views: 452