UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 రక్తపోటు పట్ల అప్రమత్తంగా వుండాలి

రక్తపోటు (బి.పి) పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తత తో వుండాలని అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ.హేమంత్ పిలుపు నిచ్చారు. శుక్రవారం మే,17 “ప్రపంచ రక్తపోటు దినం” సందర్భంగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇటీవల కాలంలో సమాజంలో రక్తపోటు బాధితుల సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లోపించడం, ఫాస్ట్ పుడ్స్ కారణంగా చిన్న వయసులోనే రక్తపోటుకు గురవుతున్నారన్నారు. 30 సం.లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా రక్తపోటు (బి.పి) పరీక్షలు చేయించుకోవాలన్నారు. తగిన మందులు వాడాలని, నడక, వ్యాయామం చేయాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అసంక్రమిత వ్యాధుల నివారణ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌష్ఠికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. డాక్టరు సలహా ప్రకారం తగిన చికిత్స తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కేంద్ర ఆసుపత్రి సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్ధినులచే జిల్లా ఆసుపత్రి నుండి నెహ్రూచౌక్ వరకు రక్తపోటు పై అవగాహనా ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుటుంబ వైద్య విధాన సమన్వయ కర్త డాక్టర్ వీరజ్యోతి, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ శివరామకృష్ణ, ఎపిడమాలజిస్ట్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest