UPDATES  

 బంగారం కోసమేనా వృద్ధురాలి హత్య?

తిమ్మాపూర్ నవంబరు 02, (తెలంగాణ వాణి ప్రతినిధి):వృద్ధురాలి మృతి తిమ్మాపూర్ మండలం లో కలకలం రేపింది. తిమ్మాపూర్‌ మండలం వచ్చునూరు గ్రామానికి చెందిన ఉప్పులేటి లచ్చవ్వ (65) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంగారు ఆభరణాల కోసమే గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో సోమవారం గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తిమ్మాపూర్‌ సీఐ అనిల్‌, ఎస్‌ఐ అరుణ్‌ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీం సహాయంతో పరిసరాలను పరిశీలించి కీలక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.లచ్చవ్వ మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారు ఆభరణాల కోసమే గుర్తుతెలియని దుండగులు ఆమెను హత్య చేసి, ఆభరణాలను అపహరించి ఉంటారని ఆరోపిస్తున్నారు. అయితే ఆమె మృతికి హత్య కారణమా? లేక ఇతర కారణాలతో అనుమానాస్పదంగా మృతి చెందిందా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌ టీం సేకరించిన ఆధారాలు, పోలీసుల విచారణలో వెల్లడయ్యే వివరాల ఆధారంగా మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 2 November 2026, 2:54 pm Posted by : TELANGANA VANI

బంగారం కోసమేనా వృద్ధురాలి హత్య?

తిమ్మాపూర్ నవంబరు 02, (తెలంగాణ వాణి ప్రతినిధి):వృద్ధురాలి మృతి తిమ్మాపూర్ మండలం లో కలకలం రేపింది. తిమ్మాపూర్‌ మండలం వచ్చునూరు గ్రామానికి చెందిన ఉప్పులేటి లచ్చవ్వ (65) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంగారు ఆభరణాల కోసమే గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో సోమవారం గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తిమ్మాపూర్‌ సీఐ అనిల్‌, ఎస్‌ఐ అరుణ్‌ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీం సహాయంతో పరిసరాలను పరిశీలించి కీలక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.లచ్చవ్వ మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారు ఆభరణాల కోసమే గుర్తుతెలియని దుండగులు ఆమెను హత్య చేసి, ఆభరణాలను అపహరించి ఉంటారని ఆరోపిస్తున్నారు. అయితే ఆమె మృతికి హత్య కారణమా? లేక ఇతర కారణాలతో అనుమానాస్పదంగా మృతి చెందిందా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌ టీం సేకరించిన ఆధారాలు, పోలీసుల విచారణలో వెల్లడయ్యే వివరాల ఆధారంగా మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest