వేములవాడ రూరల్, నవంబర్ 02 (తెలంగాణ వాణి ప్రతినిధి) :రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోచెట్టిపల్లి గ్రామానికి చెందిన బొడ్డు మల్లేశం కుమారుడు బొడ్డు వినయ్ అరుదైన ఘనత సాధించాడు. చెన్నైలో ఎంబీబీఎస్ చదువుతున్న వినయ్‌కు యూనివర్సిటీ తరఫున గోల్డ్ మెడల్‌తో పాటు డిస్టింక్షన్ లభించాయి.రైతు కుటుంబానికి చెందిన బొడ్డు మల్లేశం కుమారుడు వినయ్ విద్యలో ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా, తన తండ్రి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.వినయ్ సాధించిన విజయంతో పోచెట్టిపల్లి గ్రామంలో ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామస్థులు, ప్రముఖులు వినయ్‌ని అభినందించారు.





