UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా !

హనుమకొండ:మార్చి03

(తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్)

హనుమకొండలోని జిల్లా ఇండోర్ స్టేడియం రంగుల లోకమైంది. నిత్యం కఠినమైన శిక్షణతో, క్రమశిక్షణతో కూడిన మార్షల్ ఆర్ట్స్ సాధన చేసే తైక్వాండో విద్యార్థులు మంగళవారం హోలీ పండుగను పురస్కరించుకుని అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు.

ప్రతిరోజూ లాగే ఉదయం స్టేడియంలో తమ కోచ్,స్నేహ ఆధ్వర్యంలో కఠినమైన ప్రాక్టీస్ పూర్తి చేసిన విద్యార్థులు, అనంతరం ఒక్కసారిగా పండుగ వాతావరణంలోకి మారిపోయారు.సాధన సమయంలో ప్రదర్శించే గంభీరత్వాన్ని పక్కన పెట్టి,చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు.

ఈ సందర్భంగా తైక్వాండో హనుమకొండ జిల్లా సెక్రటరీ గడ్డం వెంకటస్వామి మాట్లాడుతూ “క్రీడలు మనకు క్రమశిక్షణను నేర్పిస్తే,ఇలాంటి పండుగలు స్నేహభావాన్ని,ఐక్యతను పెంచుతాయని నిత్యం పోటీలు,ప్రాక్టీస్ ఒత్తిడిలో ఉండే పిల్లలకు ఈ రంగుల పండుగ ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని అన్నారు.ఈ వేడుకల్లో స్టేడియం కోచ్‌లు,గుడిపల్లి స్నేహ మామునూరి సంపత్ సీనియర్ క్రీడాకారులు,డాక్టర్ జగన్ మోహన్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ,ఎస్ రవికుమార్,అల్లాడి తిరుమలశ్రీ తో పాటు తదితరులు పాల్గొని ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.స్టేడియం ప్రాంగణమంతా విద్యార్థుల కేరింతలు, నవ్వులతో సందడిగా మారింది.

రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా !

హనుమకొండ:మార్చి03
(తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్)
హనుమకొండలోని జిల్లా ఇండోర్ స్టేడియం రంగుల లోకమైంది. నిత్యం కఠినమైన శిక్షణతో, క్రమశిక్షణతో కూడిన మార్షల్ ఆర్ట్స్ సాధన చేసే తైక్వాండో విద్యార్థులు మంగళవారం హోలీ పండుగను పురస్కరించుకుని అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు.

ప్రతిరోజూ లాగే ఉదయం స్టేడియంలో తమ కోచ్,స్నేహ ఆధ్వర్యంలో కఠినమైన ప్రాక్టీస్ పూర్తి చేసిన విద్యార్థులు, అనంతరం ఒక్కసారిగా పండుగ వాతావరణంలోకి మారిపోయారు.సాధన సమయంలో ప్రదర్శించే గంభీరత్వాన్ని పక్కన పెట్టి,చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు.

ఈ సందర్భంగా తైక్వాండో హనుమకొండ జిల్లా సెక్రటరీ గడ్డం వెంకటస్వామి మాట్లాడుతూ "క్రీడలు మనకు క్రమశిక్షణను నేర్పిస్తే,ఇలాంటి పండుగలు స్నేహభావాన్ని,ఐక్యతను పెంచుతాయని నిత్యం పోటీలు,ప్రాక్టీస్ ఒత్తిడిలో ఉండే పిల్లలకు ఈ రంగుల పండుగ ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని అన్నారు.ఈ వేడుకల్లో స్టేడియం కోచ్‌లు,గుడిపల్లి స్నేహ మామునూరి సంపత్ సీనియర్ క్రీడాకారులు,డాక్టర్ జగన్ మోహన్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ,ఎస్ రవికుమార్,అల్లాడి తిరుమలశ్రీ తో పాటు తదితరులు పాల్గొని ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.స్టేడియం ప్రాంగణమంతా విద్యార్థుల కేరింతలు, నవ్వులతో సందడిగా మారింది.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest