UPDATES  

NEWS

బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాభివృద్ధి : మద్దెల సుధీర్ ఆదరించండి.. అభివృద్ధి చేస్తా : వజ్జా ఈశ్వరి భూసమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన వారికే ఓటు అవకాశం ఇవ్వండి రుణం తీర్చుకుంటా ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్

 బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాభివృద్ధి : మద్దెల సుధీర్

కొత్తగూడెం (తెలంగాణ వాణి) బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించి పల్లె ప్రగతికి బాటలు వేసిందని మద్దెల సుధీర్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం చుంచుపల్లి మండలం మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి తో కలిసి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి గ్రామాల అభివృద్ధి కోసం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. రైతు భరోసా, రైతు బీమా, వృద్ధులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో పేద ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలిచిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ కాకతీయ పథకంతో చెరువులను పూడిక తీసి భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేసిందని తెలిపారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి తాగునీరు అందించి, స్వచ్ఛ గ్రామాల ఏర్పాటుకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టిందని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులను, పండించిన పంటకు మద్దతు ధర కల్పించిన ఘనత బీఆర్ఎస్ కే దక్కిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రవేశపెట్టిందని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె ప్రగతి అటకెక్కిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కనుమరుగైందని, ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందుకే తీవ్రఇబ్బందులు పడుతున్నారని, రైతుబంధు పెట్టుబడి సహాయం అందక రైతులు అప్పుల పాలవుతున్నారని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest