ధర్మారం, (తెలంగాణ వాణి ప్రతినిధి )
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన యువకుడు ఎల్తూరి సన్నీ భారత నావీ (నేవీ) లో ఉద్యోగం సాధించిన సందర్భంగా గ్రామస్తులు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
పేదరికం, ఎన్నో ఇబ్బందుల మధ్య కూడా సన్నీ చదువుపై దృష్టి పెట్టి, పట్టుదలతో కష్టపడి చదివి నేవీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. చిన్నతనం నుంచే దేశసేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగిన సన్నీ, తన కలను నిజం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు హాజరై సన్నీకి శాలువా అభినందనలు తెలిపారు. గ్రామానికి గర్వకారణంగా నిలిచిన సన్నీని చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… పేద కుటుంబం నుంచి వచ్చి నేవీలో సెలెక్ట్ కావడం మేడారం గ్రామానికే గర్వకారణమని అన్నారు. సన్నీని ఆదర్శంగా తీసుకుని గ్రామ యువత కూడా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. సన్నీ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.



