UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 త్రాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరు మృతులకు కారణమైన అంబులెన్స్ డ్రైవర్ కు10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

కొత్తగూడెం లీగల్: త్రాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరు మృతికి కారణమైన అంబులెన్స్ డ్రైవర్ కు 10 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సోమవారం తీర్పు చెప్పారు .కేసు వివరాలు ఇలా…. భద్రాచలం కు చెందిన తోట వెంకటరమణ(57) 2020- 01- 01 తేదీన పా మీలేరు విహారయాత్రకు కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెళ్లి సాయంత్రం ఐదున్నరకు తిరిగి వస్తుండగా బూర్గంపాడు దాటిన తర్వాత పూల్లేరు వాగు వద్దకు వచ్చేసరికి తన చిన్న కూతురు తోట చంద్రకళ (28) నడుపుతున్న హోండా యాక్టివా AP 20-AN – 3337 తన పెద్ద కూతురు కూతురు వడ్డే శ్రీ లాస్య (5)కు రోడ్డు పక్కన మోటార్ సైకిల్ ఆపి తన చిన్న కూతురు తన మనవరాలికి మఫ్లర్ కట్టు చున్నది. ఇంతలో ప్రభాస్ శంకర్ హాస్పిటల్ కి చెందిన అంబులెన్స్ TS-28-T-5195 డ్రైవరు భద్రాచలం కు చెందిన ఆకుల దుర్గాప్రసాద్(32) మరియు కొంతమంది వ్యక్తులు బాగా మద్యం సేవించి ప్రమాద కరంగా నడుపుతూ వస్తూ ప్రజలకు ప్రాణహాని కలిగే విధంగా నడుపుతూ రోడ్డు ప్రక్కన నిలిపి ఉన్న తన కూతురు తన మనవరాలు స్కూటీ తో కొంత దూరం పక్కనే ఉన్న చెట్టుకు ఢీ కొన్నాడు. వెంటనే పరిగెత్తు కేల్లి పరిశీలించగా గాయాలతో అక్కడికక్కడే తన చిన్న కూతురు, తన మనవరాలు మరణించారని, కొంతమంది స్థానికులు వారిని పట్టుకుని చూడగా డ్రైవరు మద్యం సేవించి , మద్యం మత్తులో ఉండి అంబులెన్స్ లో ఉన్న మరి కొంతమంది మమ్మల్ని చూసి పారిపోయారని అప్పటి బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో అప్పటి ఎస్సై బి. బాలకృష్ణకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. అప్పటి సర్కిల్ పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ లు పి.నవీన్ జి .సత్యనారాయణ లు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు. కోర్టులో 14 మంది సాక్షులను విచారించారు .అంబులెన్స్ డ్రైవర్ ఆకుల దుర్గాప్రసాద్ (32) పై నేరం రుజువు కాగా పది సంవత్సరముల కఠిన కారాగార శిక్ష , రూ.1,000/- ల జర్మన్ విధిస్తూ తీర్పు చెప్పారు.ప్రాసిక్యూషన్ ను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీ.వీ.డి. లక్ష్మి నిర్వహించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్సై డి. రాఘవయ్య కోర్టు లైజాన్ ఆఫీసర్ ఎన్ .వీర బాబు (కోర్టు డ్యూటీ ఆఫీసర్ ) బూర్గంపాడు పీసీ మహమ్మద్ అక్రమ్ లు సహకరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest