పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీ కాన్సెప్ట్ తో గత మూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ ను జిల్లా జడ్జి వసంత్ పాటిల్ ఘనంగా సన్మానించారు.ఇటీవల జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న విషయం తెలుసుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ ప్రత్యేకంగా విశ్వామిత్ర చౌహాన్ ను పిలిపించి శాలువతో సన్మానించారు. గతంలో చాలాసార్లు చిన్నారి తనతో మొక్కలు నాటారని గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా చిన్నారి విశ్వామిత్ర చౌహాన్ జడ్జి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం జడ్జి చిన్నారికి గ్రీన్ పెన్ను ఇచ్చి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశీర్వదించారు.చిరంజీవి విశ్వామిత్ర చౌహాన్ కు ఉన్నట్టే పర్యావరణం మీద ప్రతి ఒక్కరికి శ్రద్ధ ఉండాలని బాధ్యతగా మొక్కలు నాటాలని జడ్జి అన్నారు
Post Views: 84