
జనసేన తెలంగాణ లీగల్ సెల్ సభ్యుల రాష్ట్రస్థాయి సమావేశం శనివారం హైదరాబాదులోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. జనసేనలో న్యాయవాదులకు అత్యంత గౌరవం ఉంటుందని, నవంబర్ నెలలో వెయ్యి మంది న్యాయవాదులతో సమావేశం నిర్వహిస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ ప్రకటించారు.జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ గారిని ఈ సమావేశంకు ఆహ్వానిస్తామని ఆయన అన్నారు.ఈ సమావేశంలో జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి సాగర్ ఆర్.కె. నాయుడు,జనసేన నాయకులు మచ్చా సుధాకర్,పొన్నూరు శిరీష తదితరులు పాల్గొన్నారు.
Post Views: 14



