వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరావు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ ఏక కాలంలో దాడుల నిర్వహణ
హనుమకొండ/ఖమ్మం(తెలంగాణవాణి):
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వరరావు ఇళ్లపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖలో ఈ దాడులు కలకలం సృష్టించాయి.
తహసిల్దార్ నాగేశ్వరరావు స్వస్థలం అయిన హనుమకొండలోని చైతన్యపురిలో, అలాగే ఖమ్మం జిల్లాలోని ఆయన ఇళ్లపై ఏకకాలంలో సోదాలు మొదలయ్యాయి. అదే సమయంలో, ఖిలా వరంగల్ మండల తహసిల్దార్ కార్యాలయంలో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కార్యాలయంలోని సిబ్బందిని విచారించడంతో పాటు, కొన్ని రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా కాలంగా పనిచేస్తున్న బండి నాగేశ్వరరావు గతంలో హసన్‌పర్తి, కాజీపేట తహసిల్దార్‌గా కూడా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఈ ఏసీబీ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
Post Views: 22