ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మొదటి వార్డ్ అయిన జక్కన్న పల్లి గ్రామంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన నిరుపేదలకు 2008లో ఇందిరమ్మ మోడల్ కాలనీ ఏర్పాటు చేసి 42 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు స్థలాలు కేటాయించడం జరిగింది, కొంతమంది లబ్ధిదారులు కొంతమేరకు నిర్మాణాలు చేసి మధ్యలోనే నిర్మాణాలునిలిపి వేశారు. ఇంకొందరు ఎలాంటి నిర్మాణాలు చేయకుండా అలాగే వదిలేశారు. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు స్థలాలు పొందిన లబ్ధిదారులు వారికి కేటాయించిన స్తలాలను నిర్మాణాలతో పాటు ఇతరులకు విక్రయించి ఎంతో కొంత డబ్బులు తీసుకుంటున్నారు. నిరుపేదల నుండి కొనుగోలు చేసిన సదరు విక్రయదారులు అట్టి స్థలాలను,ఇండ్లను అధిక రేట్లకు విక్రయించి పెద్ద మొత్తంలో లబ్ధి పొందుతున్నారని ధర్మారానికి చెందిన పలువురు వార్డు సభ్యులు సోమవారం మండల తహసిల్దార్ దురిశెట్టి శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు. 2008లో లబ్ధి పొందిన లబ్ధిదారులకే ఆ స్థలాలు ఇండ్లను తిరిగి వారికే ఇవ్వాలని సదరు విక్రయదారులు నిర్మిస్తున్న నూతన నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని వినతి పత్రంలో వారు కోరారు. అట్లాగే గత కొంతకాలంగా ప్రభుత్వ భూములలో ఎలాంటి పర్మిషన్లు లేకుండా రాత్రి సమయంలో అక్రమంగా మట్టి తరలిస్తు లక్షలాది రూపాయలు కూడా కట్టుకున్న మట్టి వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గాజుల రాజు, సోగాల తిరుపతి,దేవి కిషోర్,దుర్గం అంజి, అర్ధవెల్లి రజిత- రాము, ఉప్పరి శ్రావణి- సతీష్, పాల్గొన్నారు.



