UPDATES  

NEWS

చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి

 చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్

విక్రయానికి యత్నించిన నలుగురు అరెస్ట్

భద్రాద్రి బ్యూరో (తెలంగాణ వాణి) చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు యత్నించిన నలుగురు వ్యక్తులను బూర్గంపహాడ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక ఎండిన చిరుతపులి చర్మం, 17 గోర్లు, ఒక చిన్న బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబందించిన వివరాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బూర్గంపహాడ్ ఎస్‌ఐ ఈ. నాగబిక్షం ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం ఉదయం తాళ్లగొమ్మూరు గ్రామంలోని అనిల్‌కుమార్ ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద తనిఖీలు నిర్వహించగా చిరుతపులి చర్మం, గోర్లు బయటపడ్డాయి.

గుంతలో చిక్కిన చిరుతను చంపి

పోలీసుల విచారణలో నిందితులు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. గత వేసవిలో చింతూరు మండలం గమ్మలకోట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుంతలో పడి బయటకు రాలేని చిరుతపులిని రాళ్లు, కర్రలతో కొట్టి, బాణాలు విసిరి చంపినట్లు తెలిపారు. అనంతరం దాని చర్మాన్ని తొలగించి ఎండబెట్టడంతో పాటు గోర్లను భద్రపరిచినట్లు వెల్లడించారు. వాటిని విక్రయించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సారపాకకు చెందిన చల్లా అనిల్‌కుమార్‌ను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. కొనుగోలుదారులను సంప్రదించి విక్రయానికి సహకరిస్తానని అనిల్‌కుమార్ చెప్పడంతో కుంజ భద్రయ్య, కుంజా గంగరాజు, మడవి కన్నయ్యలు చిరుత చర్మం, గోర్లను బ్యాగులో పెట్టుకుని తాళ్లగొమ్మూరుకు తీసుకొచ్చారు. విక్రయానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అరెస్టయిన వారు చల్లా అనిల్‌కుమార్ (తాళ్లగొమ్మూరు), కుంజ భద్రయ్య, కుంజా గంగరాజు, మడవి కన్నయ్య (గమ్మలకోట) లను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Date of Publish : 24 August 2026, 1:07 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest