UPDATES  

NEWS

రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించి సమయస్ఫూర్తి చాటిన చందుర్తి పోలీసులు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలి తెలంగాణ గొంతు వినిపించాలంటే మళ్లీ గులాబీ జెండా ఎగరాలి ఆడిట్ ఉద్యోగుల సంఘాలకు కొత్త నాయకత్వం అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలి భైంసాలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు మంత్రి చేతుల మీదుగా ఉప సర్పంచ్ ల ఫోరం భారీ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ పేదరికాన్ని జయించి నేవీలో కొలువు… మేడారం బిడ్డ సన్నీకి ఘన సన్మానం దుర్గామాత ఆలయంలో చోరీ – వెండి హారాలు, బంగారు ముక్కుపుడక ఎత్తుకెళ్లిన దొంగలు దుర్గామాత ఆలయంలో చోరీ – వెండి హారాలు, బంగారు ముక్కుపుడక ఎత్తుకెళ్లిన దొంగలు

 ఆడిట్ ఉద్యోగుల సంఘాలకు కొత్త నాయకత్వం

కరీంనగర్ టౌన్ , నవంబర్ 29 (తెలంగాణ వాణి ప్రతినిధి ): స్టేట్ ఆడిట్ టీఎన్జీవోల అనుబంధ ఫోరం సిరిసిల్ల జోన్-III, కాళేశ్వరం జోన్-I నూతన కార్యవర్గ ఎన్నికలు కరీంనగర్ టీఎన్జీవోల భవనంలో ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నాయకుడి కోసం ఎదురుచూడకుండా బాధ్యత తీసుకొని పనిచేసే వారే నిజమైన నాయకులని అన్నారు. 80 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన టీఎన్జీవో సంఘం క్రమశిక్షణకు మారుపేరని, నూతన ప్రతినిధులు సంఘ రాజ్యాంగం, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. ఆడిట్ ఉద్యోగులు ప్రభుత్వ ఆదాయాన్ని పరిరక్షించడంతో పాటు ఆర్థిక అవకతవకలను అరికడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా నిలుస్తున్నారని కొనియాడారు.సిరిసిల్ల జోన్-III అధ్యక్షుడిగా ఈ. లక్ష్మీకాంతయ్య, కార్యదర్శిగా ఏ.వి. రాజేశ్వరరావు, కాళేశ్వరం జోన్-I అధ్యక్షుడిగా ఎస్. సుధీర్ కుమార్, కార్యదర్శిగా బి. సచిన్ రాహుల్ ఎన్నికయ్యారు. సిరిసిల్ల జోన్ అసోసియేట్ అధ్యక్షుడిగా అల్లె శ్రీనివాస్, కోశాధికారిగా డి. మునిబాబు, కాళేశ్వరం జోన్ అసోసియేట్ అధ్యక్షుడిగా ఆర్. అనిల్ రాథోడ్, కోశాధికారిగా కె. ధీరజ్ రెడ్డి ఎన్నికయ్యారు. రెండు జోన్ల కార్యవర్గాలు 2026 నుంచి 2029 వరకు మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నాయి.ఎన్నికల అధికారిగా సంగెం లక్ష్మణరావు, సహాయ ఎన్నికల అధికారిగా ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించగా, రాష్ట్ర ఫోరం కన్వీనర్ శశిధర్ రెడ్డి, ఎం. కిషన్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ పరిశీలకులుగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి సర్దార్ హర్మేందర్ సింగ్, కోట రామస్వామి, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 29 November 2026, 6:23 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest