UPDATES  

NEWS

రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించి సమయస్ఫూర్తి చాటిన చందుర్తి పోలీసులు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలి తెలంగాణ గొంతు వినిపించాలంటే మళ్లీ గులాబీ జెండా ఎగరాలి ఆడిట్ ఉద్యోగుల సంఘాలకు కొత్త నాయకత్వం అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలి భైంసాలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు మంత్రి చేతుల మీదుగా ఉప సర్పంచ్ ల ఫోరం భారీ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ పేదరికాన్ని జయించి నేవీలో కొలువు… మేడారం బిడ్డ సన్నీకి ఘన సన్మానం దుర్గామాత ఆలయంలో చోరీ – వెండి హారాలు, బంగారు ముక్కుపుడక ఎత్తుకెళ్లిన దొంగలు దుర్గామాత ఆలయంలో చోరీ – వెండి హారాలు, బంగారు ముక్కుపుడక ఎత్తుకెళ్లిన దొంగలు

 అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలి

వేములవాడ,నవంబర్ 29 (తెలంగాణ వాణి ప్రతినిధి) :అర్హత కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలని టీయూడబ్ల్యూజే హెచ్‌-143 వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను కోరారు. ఎన్నో ఏళ్లుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అర్హులైన జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు అందించేలా అవసరమైన చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల నివాస సమస్య పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేస్తామని హామీ ఇచ్చారు.ప్రభుత్వ నిధులతో, ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ప్రెస్ క్లబ్‌ భవనం లో అన్నీ జర్నలిస్టు యూనియన్లకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులకు సమానంగా అవకాశం కల్పించాలని ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ స్థలం, ప్రజాధనంతో నిర్మించిన భవనం ఏ ఒక్క వర్గానికో, యూనియన్‌కో పరిమితం కాకుండా పట్టణంలోని అన్ని యూనియన్ల వర్కింగ్ జర్నలిస్టులకు ఉపయోగపడేలా ఉండాలని స్పష్టం చేశారు.ఈ అంశంపై పరస్పర చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని ఎమ్మెల్యే సూచించారు. సంబంధిత జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని, ఐకమత్యంతో ముందుకు సాగాలని తెలిపారు.ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక నరసయ్య, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ, జిల్లా అధ్యక్షుడు సయ్యద్ లాయక్ పాషా, జిల్లా ఉపాధ్యక్షుడు రేగుల రాంప్రసాద్ ఎమ్మెల్యేను కలిసి తమ అభిప్రాయాలను వివరించారు. ప్రెస్ క్లబ్ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేలా ఎమ్మెల్యే స్వయంగా పెద్దమనిషి పాత్ర పోషించాలని కోరారు. అన్ని యూనియన్ల ప్రతినిధులతో ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి, చర్చల ద్వారా అందరూ కలిసి పనిచేసే వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ స్థలంలో, ప్రజాధనంతో నిర్మించిన ప్రెస్ క్లబ్ విషయంలో అందరికీ సమాన హక్కులు, అవకాశాలు ఉండాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని ప్రతినిధులు పేర్కొన్నారు. జర్నలిస్టుల మధ్య విభేదాలు కొనసాగడం వృత్తి ప్రయోజనాలకు మంచిది కాదని, పరస్పర అవగాహనతో సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.చర్చల ద్వారా సమస్య పరిష్కారమై అన్ని యూనియన్ల జర్నలిస్టులకు సముచిత స్థానం లభిస్తే స్వాగతిస్తామని, అలా జరగని పక్షంలో తమ హక్కుల సాధన కోసం న్యాయపోరాటానికి సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు.జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ప్రెస్ క్లబ్‌లో సమాన అవకాశాల కల్పన ఈ రెండు అంశాలపై ప్రభుత్వ విప్ ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చాలని జర్నలిస్టులు ఆశిస్తున్నారు. సమస్యల పరిష్కారం ద్వారా వేములవాడలో జర్నలిస్టుల ఐక్యతకు, వృత్తిపరమైన గౌరవానికి బాటలు పడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గం, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 29 November 2026, 5:41 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest