UPDATES  

NEWS

వివేకానంద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ని విజయవంతం చేద్దాం కటికనపల్లి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సాయిలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థిని పరామర్శించిన టిజిపిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు దార మధు టేకులపల్లి టీఎస్‌యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి డి.హరి నాయనమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించిన టిఎస్ యుటిఎఫ్ నాయకులు  పెద్దిరెడ్డి రియాన్ చక్రవర్తి ని ఆశీర్వదించిన రాకేష్ దత్త విషాదం నింపిన పోలియో చుక్కలు పెద్దచింతకుంట గ్రామంలో ఇంటింటికి సీఐటీయూ బైండ్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బైండ్ల ప్రతాప్ తడ్కల్ లో పల్స్ పోలియో కార్యాలయం

 తెలంగాణ వాణి జర్నలిస్ట్ కు రాష్ట్రస్థాయి గౌరవం

మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు – 2025 అందుకున్న పిల్లి రవికిరణ్, మహమ్మద్ ఖాసీం, క్రాంతి కుమార్

మంచిర్యాల (తెలంగాణవాణి జిల్లా ప్రతినిధి)

మంచిర్యాల జిల్లా జర్నలిస్టులు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆదివారం రాజమండ్రిలో అభిలాష హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు కార్యక్రమంలో ఉత్తమ జర్నలిస్టుల విభాగంలో రామకృష్ణాపూర్‌కు చెందిన తెలంగాణవాణి జర్నలిస్ట్ పిల్లి రవికిరణ్ తో పాటుగా మందమర్రి ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఖాసీం, క్రాంతి కుమార్ మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు – 2025ను అందుకున్నారు. ప్రజల సమస్యలను, సామాజిక అంశాలను స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకురావడంలో చూపిన నిబద్ధతకు గుర్తింపుగా వీరికి అవార్డులు లభించాయి. అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు జర్నలిస్టులు, స్నేహితులు, స్థానిక ప్రజలు వీరిని అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు పొందిన రవికిరణ్, మహమ్మద్ ఖాసీం, క్రాంతి కుమార్ మాట్లాడుతూ, “ఈ గౌరవం తమ బాధ్యతను మరింతగా పెంచిందని, ప్రజల వాస్తవ పరిస్థితులను వెలికి తీసేందుకు, న్యాయంగా సమాచారం అందించేందుకు కృషి చేస్తాం” అని తెలిపారు. ఈ అవార్డులతో మంచిర్యాల జిల్లా జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించినట్లు పలువురు వ్యాఖ్యానించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest