UPDATES  

NEWS

కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్ కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్ క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన లక్ష్మీదేవి పల్లి ఎస్ ఐ రమణ రెడ్డి

 (స్వతంత్ర ట్రేడ్ యూనియన్) ఆటో యూనియన్ ఖమ్మం నగర అధ్యక్షుడిగా పరసబోయిన వీరబాబు నియామకం

ఖమ్మం (తెలాంగాణ వాణి ప్రతినిధి హనీఫ్ పాషా) ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) పార్టీ అనుబంధ కార్మిక విభాగం (స్వతంత్ర ట్రేడ్ యూనియన్) ఆటో యూనియన్ ఖమ్మం నగర అధ్యక్షునిగా పరసబోయిన వీరబాబును, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా నియమించారు. ఈ సందర్భంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు  షేక్ బాజీ బాబా మాట్లాడుతూ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ మహమ్మద్ షకిల్ ఆదేశానుసారం ఈ నియామకం చేయటం జరిగిందని, ఆటో యూనియన్ ఖమ్మం నగర అధ్యక్షునిగా ఎన్నికైన పరసబోయిన వీరబాబు కార్మికుల పక్షాన వారి సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేయాలని, కార్మికులకు అండగా ఉండాలని, ఖమ్మం పట్టణంలో ఆటో యూనియన్ పెద్ద ఎత్తున బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ ఖమ్మం నగర అధ్యక్షునిగా ఎన్నికైన పరసబోయిన వీరబాబు మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ మహమ్మద్ షకిల్, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా, జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ రహీం, పార్టీ నగర కార్యదర్శి షేక్ హనీఫ్, షేక్ సర్వర్ పాషా లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆటో యూనియన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తోటి కార్మికుల పక్షాన నిలబడి తమకు రావలసిన హక్కుల కోసం పోరాటం చేస్తానని ఆయన అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest