UPDATES  

NEWS

కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ అధ్యక్షతన యోగ దినోత్సవం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్…. శంషాబాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు…. వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది దంపతులు వేములవాడలో మొదలైన రోడ్డు విస్తరణ పనులు ASI లుగా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్

 రేపటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయండి

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

రేపు కొత్తగూడెంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో బీ‌ఆర్ఎస్ జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు కొట్టి వెంకటేశ్వర రావు తెలిపారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆదేశాల మేరకు కొత్తగూడెం తెలంగాణ భవన్ లో జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూధన్, మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, జిల్లా స్థాయి నాయకులు హాజరవుతున్నారు. టిబిజికేఎస్, బిఆర్ టియు, బిఆర్ఎస్వి, బిఆర్ఎస్ యువజన, బిఆర్ఎస్ పార్టీ అనుబంధ శాఖల ముఖ్య నాయకులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర రావు పిలుపునిచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest