మెట్ పల్లి (తెలంగాణ వాణి)
మెట్‌పల్లి డివిజన్ పరిధిలోని మల్లాపూర్ మండలం మొగిలిపేట, నడకుడా గ్రామాల సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. శనివారం మొగిలిపేట గ్రామస్తులు ధాన్యం విక్రయించేందుకు వివాదాస్పద స్థలాన్ని చదును చేయడంతో విషయం తెలుసుకున్న నడకుడ గ్రామస్తులు రావడంతొ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవెన్యూ, పోలీస్ శాఖ వారు సంఘటన స్థలానికి వచ్చారు. మల్లాపూర్ తాసిల్దార్ వీర్ సింగ్ రెండు గ్రామాల సరిహద్దు వివాదాన్ని పరిష్కరిస్తామని అన్నా కాని శాంతించకపోవడంతో ఆర్డిఓ శ్రీనివాస్, డిఎస్పి రాములు, మెట్‌పల్లి, కోరుట్ల సిఐలు అనిల్ కుమార్, సురేష్ బాబు ఆయా సర్కిల్ పరిధిలోని ఎస్సైలు కూడా పోలీసు సిబ్బందితో వచ్చి రెండు గ్రామాల ప్రజలు ఎలాంటి తొందరపాటు చర్యలు చేపట్టకుండా వారికి నచ్చ చెప్పారు. అనంతరం మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ ఏప్రిల్ 16వ తేదీన గ్రామ సరిహద్దుల సర్వే చేయించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీనితో రెండు గ్రామాల ప్రజలు ఆందోళన విరమించారు.