UPDATES  

 అత్యున్నత న్యాయవ్యవస్థపై దాడి దారుణం

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ రహీం

ఖమ్మం (తెలాంగాణ వాణి ప్రతినిధి హనీఫ్ పాషా) మతోన్మాదం ఏ విధంగా రెచ్చిపోతుందో చెప్పడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి ఆర్ గవాయిపై జరిగిన దాడే ప్రధాన సాక్ష్యం అని, దాడి చేసిన రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ రహీం డిమాండ్ చేశారు. సభ్యసమాజం తలదించుకునేలా రాకేష్ కిషోర్ చేసిన దాడి దేశానికి కళంకమని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి పైనే దాడికి పాల్పడటం ముమ్మాటికీ దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కుల వివక్ష రోజుకు పెరిగిపోతుందని దీని ఆసరాగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని ఇలాంటి పరిణామాలు సమాజానికి ప్రమాదకరమని కఠిన చర్యలతో శిక్షలు విధించాలని లేకపోతే న్యాయస్థానంపై ప్రజలకు నమ్మకం పోతుందని కావున వెంటనే రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest