ఖమ్మం (తెలాంగాణ వాణి ప్రతినిధి హనీఫ్ పాషా) దసరా పండుగ నేపథ్యంలో, ప్రయాణీకులను ఆకర్షించేందుకు – ప్రయాణీకుల ఆదరణను పెంచుకోవడానికి తెలంగాణా రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ప్రకటించిన లక్కీ డ్రా ను ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్ పరిధిలో ఈరోజు ఖమ్మం నూతన బస్టాండ్ లో ప్రయాణీకుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఖమ్మం అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా సదరు లక్కీ డ్రా ను నిర్వహించి విజేతలను ప్రకటించడం జరిగింది. విజేతల వివరాలుఇలా ఉన్నాయి మొదటి బహుమతి కాంతారావు, రెండవ బహుమతి సాయిబాబా, మూడవ బహుమతి పి.సునీల్ కుమార్. సంస్థ హైదరాబాదులో నిర్వహించబోయే కార్యక్రమంలో విజేతలందరికీ నగదు బహుమతులను ప్రధానం చేయనున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరిరాం తెలియజేశారు. అదేవిధంగా, లక్కీ డ్రాలో ఎంపిక కాబడిన విజేతలకు అభినందనలు తెలియజేసి, ప్రజా రవాణాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అడిషనల్ కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ వి.మల్లయ్య, ఖమ్మం డిపో మేనేజర్ ఎం. శివప్రసాద్, సెక్యూరిటీ అధికారి, కోటాజీ, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు మరియు ప్రయాణికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



