నిజామాబాద్ (తెలంగాణ వాణి)
చిన్ననాడు ఆడిపాడుతూ చదువుకున్న చిన్నప్పటి స్మృతులను గుర్తుచేసుకుంటూ చదువులమ్మ ఒడిలో సందడి చేశారు. మోస్రా భారతీయ విద్యానికేతన్ హైస్కూల్ 1996-97 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని అపూర్వంగా జరుపుకున్నారు. చదువులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. శాలువా, పూల దండలు వేసి, మెమెంటో అందజేసి గురువులు రంగారావు అనసూయ, శివసచరణ్, హరిచర్సన్, వెంకటేష్, సంజీవ్, గోపాల్, నాగభూషణం, సాయిలు, విజేందర్, స్వరూప, పాదాలకు నమస్కరించారు. ఉదయం నుంచి డిఆర్ఆర్ ఫంక్షనల్ లో ఎంతో ఉల్లాసంగా గడిపారు. ఎవరు ఎక్కడ, ఏ రంగంలో స్థిరపడ్డారో సమ్మేళనంలో పరిచయం చేసుకున్నారు. ఆనాటి తీపి గుర్తులను నెమరు వేసుకుంటూ సంతోషంగా గడుపుతారు. పాఠశాల ద్వారా తాము ఇంత మంది కలవడం సంతోషంగా ఉందన్నారు. అందరు కలిసి భోజనాలు చేశారు. ఎంతో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన భారతీయ విద్యా నికేతన్ హైస్కూల్ రుణం తీర్చుకోలేనిదని విద్యార్థులు అన్నారు. గురువులకు ఎప్పటికీ రుణపడి వుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు 1996-1997 బ్యాచ్ తదితరులు పాల్గొన్నారు.